రామ్ చరణ్ నటిస్తున్న “పెద్ది” చిత్రం పై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో రూపొందుతుంది. బుచ్చిబాబు తన మొదటి చిత్రం “ఉప్పెన”తో ఘన విజయాన్ని సాధించడంతో, “పెద్ది” పై మరింత ఆసక్తి పెరిగింది. రామ్ చరణ్ కెరీర్‌లో ఇది ఒక కీలకమైన చిత్రం కాబట్టి, ప్రేక్షకుల్లో ఆసక్తి మరింతగా పెరిగింది.
ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ ఏప్రిల్ 6, 2025న శ్రీరామ నవమి సందర్భంగా విడుదల కానుంది. ఇటీవల మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ విశేషంగా ఆకట్టుకుంది. ఇందులో చెవికి పోగు, పొడవైన జుట్టు, గుబురు గడ్డంతో రా మరియు రగ్డ్ లుక్‌లో రామ్ చరణ్ కనిపించగా, సోషల్ మీడియాలో ఈ లుక్ సంచలనంగా మారింది. ఇప్పుడు ప్రేక్షకుల్లో అంచనాలను మరింత పెంచేందుకు “ఫస్ట్ షాట్” పేరుతో ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది.
“పెద్ది” చిత్రంలో రామ్ చరణ్ పవర్‌ఫుల్ రోల్ పోషించనున్నారు. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, ఇది ఆమె రెండో తెలుగు సినిమా కావడం విశేషం. అలాగే, ప్రముఖ నటులు శివ రాజ్‌కుమార్, జగపతిబాబు, మిర్జాపూర్ ఫేమ్ దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి అకాడమీ అవార్డు గ్రహీత ఏ.ఆర్. రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. అద్భుతమైన విజువల్స్‌ను సినిమాటోగ్రాఫర్ ఆర్. రత్నవేలు ఐఎస్‌సి అందిస్తుండగా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.
“పెద్ది” చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా, వృద్ధి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఈ భారీ బడ్జెట్ పాన్-ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఒక అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌గా మార్చేందుకు మేకర్స్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. 2025లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం, ఫస్ట్ గ్లింప్స్ ద్వారా కథాంశాన్ని మరియు రామ్ చరణ్ పాత్ర తీవ్రతను పరిచయం చేయనుంది. ఏప్రిల్ 6న విడుదల కానున్న ఫస్ట్ షాట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
#PeddiFirstShot – Glimpse video out on 6th April on the occasion of Sri Rama Navami ❤️🔥
Wishing you a very Happy Ugadi ✨#Peddi 🔥
Global Star @AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor @arrahman @RathnaveluDop @artkolla @NavinNooli @IamJagguBhai @divyenndu @vriddhicinemas… pic.twitter.com/JBsv5ugWgF
— BuchiBabuSana (@BuchiBabuSana) March 30, 2025