మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో ఆస్తుల వివాదం రోజు రోజుకు కొత్త మలుపులు తీసుకుంటోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇది ప్రధాన చర్చగా మారింది. మంచు కుటుంబంలో అంతర్గత తగాదాలు, రాజకీయ సంబంధాలు, కుటుంబ సభ్యుల మధ్య పెరిగిన విభేదాలు ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా నిలిచాయి.
ఆస్తుల వివాదానికి రాజకీయ కోణం?
ఈ వివాదానికి రాజకీయ కోణం కూడా ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మంచు మనోజ్, భూమా మౌనిక రెండో పెళ్లి తర్వాత నుంచి ఈ గొడవలు మరింత ముదిరాయని అంటున్నారు. భూమా మౌనిక రాజకీయంగా ప్రభావం కలిగిన కుటుంబానికి చెందినవారు. ఆమె సోదరి భూమా అఖిలప్రియ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మనోజ్, మౌనికకు భూమా కుటుంబం, టీడీపీ నాయకత్వం నుంచి మద్దతు ఉందని భావిస్తున్నారు.
మోహన్ బాబు ఫిర్యాదులు
తనకు మనోజ్, మౌనిక నుంచి ప్రాణహాని ఉందని, ఆళ్లగడ్డ నుంచి వచ్చిన అనుచరులు కుటుంబానికి హాని కలిగించవచ్చని మోహన్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మోహన్ బాబు యూనివర్సిటీలో అవకతవకలపై మనోజ్ ఆరోపణలు చేయడం, మనోజ్‌ను రౌడీలతో దాడి చేయించారన్న ఆరోపణలు తెరపైకి వచ్చాయి.
కుటుంబ సంబంధాల్లో విభేదాలు
మోహన్ బాబు కుటుంబానికి సంబంధించిన మరో సంచలన విషయం ఏమిటంటే, మంచు విష్ణు, మంచు మనోజ్ సొంత అన్నదమ్ములు కాదు. మోహన్ బాబుకు రెండు పెళ్లిళ్లు కాగా, మొదటి భార్య విద్యాదేవి నుంచి విష్ణు, లక్ష్మీ జన్మించారు. రెండో భార్య నిర్మలా దేవి నుంచి మనోజ్ జన్మించారు. ఈ కారణంగా వీరి మధ్య శాంతి కాలం నుంచే అంతరాలు ఉన్నాయని అంటున్నారు.
చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. మోహన్ బాబుకు ఇద్దరు భార్యలు. మోహన్ బాబు మొదట విద్యాదేవి అని యువతిని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళిద్దరికి కలిగిన సంతానమే మంచు విష్ణు, మంచు లక్ష్మీ. అయితే.. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత విద్యాదేవి ఆనారోగ్యంతో కన్నుమూసింది.
ఆ తర్వాత కొంత కాలానికే.. విద్యాదేవి చెల్లెలు నిర్మలా దేవిని మంచు మోహన్ బాబు రెండో పెళ్ళి చేసుకున్నాడు. ఇక వీళ్లిద్దరికి మనోజ్ పుట్టాడు. అలా.. మంచు మనోజ్, మంచు విష్ణు సొంత అన్నదమ్ముళ్లు కాలేకపోయారు. ఇక ఇప్పుడు మనోజ్ 41 ఏళ్లు. మొత్తానికి ఇన్నేళ్ల తర్వాత వీరిద్దరు సొంత అన్నదమ్ముళ్లు కాదనే సంచలన నిజాలు ఇప్పుడు చాలా మందికి తెలిశాయి.
అయితే.. మంచు లక్ష్మీకి మాత్రం మంచు విష్ణుపై కంటే మంచు మనోజ్‌పైనే ప్రేమ ఎక్కువగా ఉంటుందని ఇండస్ట్రీలో అంటుంటారు. ఏది ఏమైనా ఇలా ఆస్తుల గురించి తండ్రి, ఇద్దరు అన్నదమ్ముళ్లు మధ్య గొడవలు రావడం అనేది ఇండస్ట్రీలో దుమారం రేపుతుంది. ఇక గతంలో కూడా మనోజ్, విష్ణులు గొడవ పడ్డ వీడియోలు సోషల్ మీడియాలో దుమారం రేపాయి.
గత వివాహాలు, ప్రస్తుతం వివాదాలు
మంచు మనోజ్ మొదట ప్రగతి రెడ్డిని వివాహం చేసుకోగా, ఆ వివాహం విఫలమైంది. ఆ తర్వాత భూమా మౌనికను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ, ఈ వివాహం మంచు ఫ్యామిలీకి ఇష్టంగా లేదని తెలిసింది. మంచు విష్ణు కూడా ఈ పెళ్లికి హాజరుకాలేదు.
మోహన్ బాబు, మంచు మనోజ్, మంచు విష్ణు మధ్య జరుగుతున్న ఈ వివాదాలు తారాస్థాయికి చేరుకోవడం సినీ ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది. రాజకీయ కోణంతో పాటు కుటుంబ విభేదాలు, మనోజ్, మోహన్ బాబు మధ్య పెరిగిన చిచ్చు సినీ ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీస్తోంది.