అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన పుష్ప-2 సినిమా ప్రీమియర్ షోల నుంచే బ్లాక్‌బస్టర్ టాక్‌ను సొంతం చేసుకుంది. మొదటి రోజే తెలుగు వెర్షన్ రూ. 95.1 కోట్లు, హిందీ రూ. 67 కోట్లు సహా అన్ని భాషలలో కలిపి రూ. 175 కోట్ల వసూళ్లను సాధించింది. రెండో రోజుకు వచ్చేసరికి హిందీ వెర్షన్ రూ. 130 కోట్లను రాబట్టి పుష్ప 1 లైఫ్‌టైమ్ కలెక్షన్‌ను మించి, ఈ ఏడాది టాప్ 10 అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రాల్లో చోటు దక్కించుకుంది. మొత్తం బాక్సాఫీస్ వసూళ్లలో కాస్త తగ్గుదల కనిపించినప్పటికీ, తెలుగు రాష్ట్రాల్లో ఆక్యుపెన్సీ 75-78% స్థాయిలో కొనసాగింది.
సినిమాలో అల్లు అర్జున్ విశ్వరూపం, యాక్షన్ సీక్వెన్స్‌లు, రష్మిక మందన్న డాన్స్‌లు, జాతర సీక్వెన్స్‌లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. పుష్ప 2 విడుదలైన రెండు రోజుల్లోనే భారీ విజయాన్ని నమోదు చేసి, కేజీఎఫ్, బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి రికార్డులను ఛేదించబోతోంది. సినిమా కలెక్షన్లు రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉండటంతో, బాక్సాఫీస్ వద్ద “పుష్ప 2” ర్యాంపేజ్ కొనసాగుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
సోషల్ మీడియాలో కొత్త వివాదం
పుష్ప-2పై సోషల్ మీడియాలో కొత్త వివాదం చెలరేగింది. అల్లు అర్జున్ పాత్రలో మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ డైలాగ్‌లు ఉన్నాయనే ఫేక్ న్యూస్ ప్రచారం చేయడంతో తీవ్ర దుమారం రేగింది. ‘‘ఎవడ్రా బాస్, ఎవడికి రా బాస్…’’ అనే ఊహాజనిత డైలాగ్‌ను వైరల్ చేస్తూ, మెగా వర్సెస్ అల్లు అనే వివాదం మరోసారి తెరపైకి వచ్చింది.
మైత్రీ మూవీ మేకర్స్ స్పందన
ఈ విషయంపై నిర్మాత మైత్రీ మూవీ మేకర్స్ ఆగ్రహంతో స్పందించారు. ‘‘సినిమాపై కావాలని నెగటివ్ ప్రచారం చేస్తున్నవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’’ అని హెచ్చరించారు. పైరసీ వీడియోలపై కూడా చర్యలు చేపట్టారు. పైరసీ లింక్‌లను గుర్తించి యాంటీ పైరసీ ఫోరమ్‌కు రిపోర్ట్ చేయాలని ప్రజలను కోరారు.
నెగెటివ్ ప్రచారం సినిమా హిట్ పై నో ఎఫెక్ట్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 థియేటర్లలో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. కానీ మరోవైపు, సోషల్ మీడియా వివాదాలు సినిమా పట్ల చర్చలకు దారితీస్తున్నాయి. చిత్రబృందం వివాదాలను ఎదుర్కొంటూ, సినిమా ప్రతిష్టను కాపాడేందుకు దృష్టి పెట్టింది.
ఇదే సమయంలో, పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించడం అందరిని కుదిపేసింది. ఈ విషాద ఘటనపై చిత్ర కథానాయకుడు అల్లు అర్జున్ స్పందించారు. బాధిత కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ, రేవతి కుటుంబానికి రూ. 25 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. ‘‘మేము మీకు అండగా ఉన్నాం. వైద్య ఖర్చులతో పాటు, కుటుంబ భవిష్యత్తుకు నిధులు అందిస్తాం’’ అని భరోసా ఇచ్చారు. అభిమానులకు తాను జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూ, ‘‘సినిమా చూసి ఆనందించండి, ఇంటికి క్షేమంగా తిరిగి వెళ్లండి’’ అని హితవు పలికారు.
Any unauthorized videos or spoilers of the movie #Pushpa2 can be reported immediately to the Anti Piracy Control Room @AntipiracyS
We will bring them down immediately.
[email protected]
Whatsapp: 8978650014— Mythri Movie Makers (@MythriOfficial) December 6, 2024
ఊహాజనితమైన, సొంత క్రియేటీవిటితో పుట్టించిన కొన్ని డైలాగులు పుష్ప-2 చిత్రంలోనివి అంటూ కొంత మంది కావాలని సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తున్నారు. వాంటెడ్ గా కొంత మంది సినిమాపై నెగటివ్ ప్రచారం కోసం కావాలని ఇలాంటివి పోస్ట్ చేస్తున్నారు. దయచేసి ఇప్పటికైనా ఇలాంటి పోస్టులు పోస్ట్ చెయ్యటం…
— Mythri Movie Makers (@MythriOfficial) December 6, 2024