ఆస్కార్‌ విజేతలను సత్కరించిన ఎంఎస్‌ ధోని.. ‘ది ఎలిఫెంట్ విష్పరర్స్’ టీమ్‌కు స్పెషల్ గిఫ్ట్స్‌

MS Dhoni Gifts CSK Jersey To Oscar-Winning The Elephant Whisperers Fame Bomman and Bellie,MS Dhoni Gifts CSK Jersey To Oscar-Winning,Oscar-Winning The Elephant Whisperers,Oscar-Winning The Elephant Whisperers Fame Bomman and Bellie,Mango News,Mango News Telugu,MS Dhoni Gifts CSK Jersey To Fame Bomman and Bellie,MS Dhoni gifts personalised CSK jerseys to team of Oscar-winner,MS Dhoni gifts CSK number 7 jersey to Elephant Whisperers,The Elephant Whisperers,Bomman and Bellie,MS Dhoni Latest News And Updates

భారత క్రికెట్ లెజెండ్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ఫ్రాంచైజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నాడు. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఇటీవల అస్కార్‌ అందుకున్న ‘ది ఎలిఫెంట్ విష్పరర్స్’ యూనిట్‌ను సత్కరించేందుకు చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం ఒక స్పెషల్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ సందర్భంగా మూవీ యూనిట్‌ను సీఎస్కే కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని ఘనంగా సత్కరించాడు. ఆస్కార్ విజేతలతో ఆప్యాయంగా మాట్లాడి అభినందనలు తెలిపిన ధోనీ, అనంతరం వారికి స్పెషల్ గిఫ్ట్స్‌ను అందజేశాడు. ఈ సందర్భంగా ధోని తన నెం.7 జెర్సీలను బొమ్మన్, బెల్లీ, గొన్సాల్వేజ్ లకు అందజేశాడు. స్టేడియంలో శిక్షణ అనంతరం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో వీరిద్దరికీ, చిత్రనిర్మాత కార్తికీ గోన్సాల్వేస్‌కి ధోనీ తన నంబర్ 7 జెర్సీలను బహుమతిగా ఇచ్చాడు.

ఈ సందర్భంగా ధోనీ తన కుమార్తె జివాను సైతం ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్ యూనిట్‌కు పరిచయం చేసి వారితో కరచాలనం చేయించారు. కాగా ఆస్కార్-విజేత డాక్యుమెంటరీ ఎలిఫెంట్ విస్పరర్స్ ద్వారా ప్రసిద్ధి చెందిన ఏనుగుల సంరక్షకులైన బొమ్మన్ మరియు బెల్లీకి తన ప్రతేకమైన జెర్సీని బహుమతిగా ఇవ్వడం ద్వారా వేల మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ క్రికెట్ లిమిటెడ్ సీఈఓ కేఎస్ విశ్వనాథన్‌తో పాటు జట్టు యజమాని రూపా గురునాథ్ జ్ఞాపికలను అందజేశారు. అలాగే ఏనుగుల సంక్షేమం కోసం ముదుమలై టైగర్ కన్జర్వేషన్ ఫౌండేషన్‌కు పెద్దమొత్తంలో నగదును కూడా అందజేసింది. కాగా ఇటీవలే తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ మరియు సూపర్ స్టార్ రజినీకాంత్ వంటి ప్రముఖులు కూడా ఎలిఫెంట్ విష్పరర్స్ యూనిట్‌ను ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపిన విషయం తెలిసిందే.

కాగా కొన్ని రోజుల క్రితం జరిగిన అస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవంలో ఇండియా నుంచి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో పాటు ‘ది ఎలిఫెంట్ విష్పరర్స్’ బెస్ట్ డాక్యుమెంటరీ విభాగంలో పురస్కారం గెల్చుకున్న సంగతి తెలిసిందే. కార్తికి గోన్సాల్వేస్ దర్శకత్వం వహించిన ఈ మూవీ బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో అత్యున్నత పురస్కారం అందుకుంది. భారత్ తరఫున ఆస్కార్ గెలుచుకున్న మొదటి డాక్యుమెంటరీ కూడా ఇదే. అంతర్జాతీయ ప్రశంసలు పొందిన ఈ డాక్యుమెంటరీలో, టోత్ బొమ్మన్ మరియు బెల్లీకి రఘు అనే అనాథ పిల్ల ఏనుగు సంరక్షణ బాధ్యతలు అప్పగించబడతాయి. వారిద్దరూ గాయపడిన ఆ ఏనుగు పిల్లను జాగ్రత్తగా చూసుకుంటారు. వారి ప్రత్యేక శ్రద్ధ ఫలితంగా ఆ గున్న అనారోగ్యం నుంచి వేగంగా కోలుకుని సంతోషకరమైన జీవితాన్ని గడుపుతుంది. ఈ క్రమంలో వారు దానిని మళ్ళీ మాములుగా చేయడానికి చేసే ప్రయత్నం ప్రేక్షకులను అలరిస్తుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 2 =