అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో, రష్మిక మందన్న, ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రల్లో నటించిన పుష్ప 2: ది రూల్ ఇండియన్ సినిమా చరిత్రలో మరో చరిత్రను లిఖించింది. ఈ చిత్రం విడుదలైన మొదటి వారాంతంలోనే రూ. 500 కోట్ల క్లబ్‌లో చేరి, అతి వేగంగా ఈ మార్కును అందుకున్న చిత్రంగా నిలిచింది. జవాన్ హిందీ వర్షన్ కలెక్షన్ల రికార్డును నాలుగు రోజుల్లోనే రూ.280 కోట్లను అందుకొని అధిగమించింది. ఇక అసలు పరీక్ష సోమవారం నుంచి ప్రారంభమవుతుందని అనిపించినా, పుష్ప 2 జోరు చూస్తుంటే ఇది చిన్న సమస్యే అనిపిస్తోంది.
పుష్ప 2 బాక్సాఫీస్ కలెక్షన్లు: 4వ రోజు
సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం భారత్‌లో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. శనివారం అద్భుతమైన కలెక్షన్లను నమోదు చేసిన తర్వాత, ఆదివారం కూడా ఇదే ఉత్సాహంతో కొనసాగుతుందని ఊహించబడింది. అంచనాలకు అనుగుణంగా, పుష్ప 2 ఆదివారం ఒక్కరోజు భారతీయ బాక్సాఫీస్‌లో రూ. 141.5 కోట్లు వసూలు చేసింది.
తెలుగు వర్షన్ (ఒరిజినల్) ఆదివారం రూ. 44 కోట్లను రాబట్టింది, కానీ హిందీ వర్షన్ రూ. 85 కోట్లతో అగ్రస్థానంలో ఉంది. తమిళం, కన్నడ, మలయాళం భాషల వర్షన్లు కలిపి రూ. 12.5 కోట్లు రాబట్టాయి.
4 రోజుల మొత్త కలెక్షన్ల వివరాలు
పుష్ప 2 నాలుగు రోజుల్లోనే భారతీయ బాక్సాఫీస్‌లో రూ. 529 కోట్ల భారీ వసూళ్లను సాధించింది. తెలుగు వర్షన్ రూ. 198.55 కోట్లు, హిందీ వర్షన్ రూ. 285.7 కోట్లు వసూలు చేశాయి.
ఆదివారం తెలుగు ఆక్యుపెన్సీ 73.50% ఉండగా, మహబూబ్‌నగర్‌లో 92.75% అత్యధిక ఆక్యుపెన్సీ నమోదైంది. హిందీ ఆక్యుపెన్సీ 84.25% ఉండగా, పుణేలో 91.75% నమోదైంది.
పుష్ప 2 ప్రపంచవ్యాప్త కలెక్షన్లు
Sacnilk నివేదిక ప్రకారం, పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా రూ. 800 కోట్ల మార్కును మొదటి వారాంతంలోనే అధిగమించింది. నాలుగో రోజు ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ. 185 కోట్లు వసూలు చేసింది.