సంధ్య థియేటర్ లో పుష్ప 2 మరో క్రేజీ రికార్డ్..

Pushpa 2 Sets Another Crazy Record In Sandhya Theater

మాస్ ఆడియన్స్ సింగల్ స్క్రీన్స్ లో ఫస్డ్ డే ఫస్ట్ షో చూడాలని కోరుకునే సెంటర్స్ లో హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఒకటి. అలాంటి సందర్భంలోనే ఇటీవల పుష్ప 2 ప్రీమియర్ షో సమయంలో తొక్కిసలాట ఘటన జరిగి తీవ్ర పరిణామాలకు దారి తీసింది. అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడంతో పాటు.. ఈ థియేటర్ కి లైసెన్స్ ని రద్దు చేస్తారేమోనని అనుకున్నారు. అయితే ఈ థియేటర్లో ఇప్పటికీ కూడా పుష్ప 2 చిత్రం హౌస్ ఫుల్ కలెక్షన్స్‌తో నడుస్తుంది.

సంక్రాంతి పండుగ సందర్భంగా 20 నిమిషాల అదనపు సన్నివేశాలను జత చేసి ‘పుష్ప 2 – రీ లోడెడ్’ వెర్షన్‌ని రీ రిలీజ్ చేశారు. దీనికి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. లాస్ట్ వీకెండ్ లో సంధ్య థియేటర్ హౌస్ ఫుల్స్ రికార్డ్స్ నమోదు చేసుకొని సంచలనం సృష్టించింది. అయితే అతి త్వరలోనే ఈ మూవీ ఈ థియేటర్ లో అరుదైన రికార్డు ని నెలకొల్పబోతుంది.

ఇప్పటి వరకు ఈ మూవీకి ఇప్పటి వరకూ కోటి 90 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. 2001లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఖుషీ మూవీకి ఇక్కడ కోటి 58 లక్షల రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. పుష్ప 2 కంటే ముందు ఎన్నో పాన్ ఇండియన్ సినిమాలు ఈ థియేటర్ లో విడుదలై ఎన్నో బ్లాక్ బస్టర్ విజయాలు నమోదు చేసుకున్నాయి.

కానీ ఒక్క సినిమా కూడా పవన్ కళ్యాన్ ఖుషి రికార్డు దరిదాపుల్లోకి వెళ్లలేకపోయింది. కానీ పుష్ప 2 మూవీ ఖుషీ రికార్డు ని క్రాస్ చేయడమే కాకుండా మరో 50 లక్షల రూపాయిల గ్రాస్ ని అదనంగా రాబట్టి రికార్డ్ సృష్టించింది. ప్రస్తుతానికి కోటి 90 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన పుష్ప 2 అతి త్వరలోనే రెండు కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని అందుకోబోతోంది. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇప్పటినుంచే సంబరాలు చేసుకుంటున్నారు.