టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు సాగ‌ర్ క‌న్నుమూత‌

Veteran Tollywood Film Director Sagar Passed Away at Chennai Today,Veteran Tollywood Film Director Sagar,Tollywood Film Director Sagar,Director Sagar Passed Away,Mango News,Mango News Telugu,Director Sagar Movies List,Director Sagar Wikipedia,Sagar Director Movies,Sagar Film Director,Sagar Telugu Movie,Telugu Film Director Sagar Wiki,Tollywood Film Directors,Vinayak Movies,Director Sagar Movies,Telugu Actor Vidyasagar,Director Vidya Sagar Reddy,Sagar K Chandra Biography,Vv Vinayak,Sagar K Chandra,Director Sagar Wikipedia,Telugu Director Sagar Movies List,Sagar Director

టాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు సాగ‌ర్ క‌న్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని త‌న నివాసంలో గురువారం తుదిశ్వాస విడిచారు. గుంటూరు జిల్లాకు చెందిన సాగర్ అనుకోకుండా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి అగ్ర దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో పెద్ద ద‌ర్శ‌కులుగా పేరు తెచ్చుకున్న వీవీ వినాయ‌క్‌, శ్రీను వైట్ల, ఏఎస్ రవి కుమార్ చౌదరి, మరియు జి. నాగేశ్వర రెడ్డి తదితరులు సాగ‌ర్ శిష్యులే కావడం విశేషం. కాగా తన సుదీర్ఘ సినీ కెరీర్‌లో సాగ‌ర్ 30కి పైగా సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. క్రమశిక్షణకు మారుపేరైన సాగర్ అతి తక్కువ సమయంలో సినిమాలు తీసేవారు. తొలుత ‘మ‌హ్మ‌ద్ బిన్ తుగ్ల‌క్’ సినిమాతో స‌హాయ ద‌ర్శ‌కుడిగా కెరీర్ ప్రారంభించిన సాగ‌ర్.. ఆ తర్వాత ‘నీడ‌లేని ఆడ‌ది’, ‘నాయుడి గారి అబ్బాయి’ వంటి హిట్ సినిమాలతో పాటు ఇతర సినిమాల‌కు అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేశారు.

అనంతరం 1983లో న‌రేష్, విజ‌య‌శాంతి కాంబినేష‌న్‌లో ‘రాకాసి లోయ’ సినిమాతో ద‌ర్శ‌కుడిగా మారారు. ‘స్టూవ‌ర్డ్‌పురం దొంగ‌లు’ సినిమాతో టాలీవుడ్‌లో నిల‌దొక్కుకున్నాడు. ఇక ఈ క్రమంలో ఆయన డైరెక్ట‌ర్‌గా చేసిన ‘దాడి, జ‌గ‌దేక వీరుడు, అన్వేష‌ణ‌, ఖైదీ బ్ర‌ద‌ర్స్‌’ వంటి సినిమాలు అప్పట్లో మంచి హిట్ అయ్యాయి. సుమ‌న్ హీరోగా రూపొందిన ‘రామ‌స‌క్క‌నోడు’ సినిమాతో ఆయన అగ్రదర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఈ సినిమా మూడు నంది అవార్డుల‌ను సొంతం చేసుకోవడం గమనార్హం. ఇక సూపర్ స్టార్ కృష్ణ కెరీర్ చరమాంకంలో సూపర్ హిట్ అందుకున్న ‘అమ్మ‌దొంగ’ సినిమా సాగ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వచ్చిందే. తెలుగు సినిమా దర్శకుల సంఘానికి సాగర్ మూడుసార్లు అధ్యక్షుడిగా పనిచేయడం విశేషం. కాగా డైరెక్టర్ సాగర్ మృతుతో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here