బిగ్ బాస్ -3 వైల్డ్ కార్డు ఎంట్రీ గా శిల్పాచక్రవర్తి

Anchor Shilpa Chakravarthy Enters Into Bigg Boss House, Anchor Shilpa Chakravarthy Enters Into Bigg Boss House As a Wild Card Entry, Bigg Boss Episode 25 Bigg Boss Season 3 Telugu, Bigg Boss Season 3 Telugu, Bigg Boss Season 3 Telugu Latest Updates, Bigg Boss Season 3 Updates, Mango News Telugu, Shilpa Chakravarthy Enters Into Bigg Boss House, Shilpa Chakravarthy Wild Card Entry, Shilpa Chakravarthy Wild Card Entry Into Bigg Boss House

జూలై 21 నాడు ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు 3వ సీజన్ తెలుగు ప్రేక్షకులను అలరిస్తుంది. 44వ ఎపిసోడ్ లో నటి, యాంకర్ శిల్పాచక్రవర్తి వైల్డ్ కార్డు ఎంట్రీగా బిగ్ బాస్ హౌజ్ లోకి ప్రవేశించించారు. మొదటగా వైల్డ్ కార్డు ఎంట్రీగా వచ్చినా తమన్నా సింహాద్రి రెండువారాలకే ఎలిమినేట్ అయ్యింది. కింగ్ అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవరిస్తున్నా ఈ షో 100 రోజుల పాటు సాగనుంది. అయితే గత శని, ఆదివారాలు ఎపిసోడ్స్ కు మాత్రం నటి రమ్యకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించి తనదైన శైలిలో మెప్పించింది. ఈ వారం ఇంటి నుంచి ఎవరిని ఎలిమినేట్ చేయలేదు.

ఆసక్తికరంగా సాగుతున్న ఈ షోలో ప్రస్తుతం 12 మంది సభ్యులు ఇంటిలో ఉన్నారు. చాల రోజుల నుండి తెలుగు ప్రేక్షకులకు యాంకర్ గా పరిచయమున్న శిల్పా చక్రవర్తి రెండో వైల్డ్ కార్డు ఎంట్రీగా వచ్చింది. ఇప్పటికే రకరకాల గొడవలు, జట్టులతో కొనసాగుతున్న బిగ్ బాస్ ఇంట్లో శిల్పా చక్రవర్తి ఏ విధంగా అలరిస్తుందో వేచి చూడాలి. సోమవారం నాడు జరిగిన నామినేషన్ ప్రక్రియలో ఎక్కువమంది అలీరేజా, రవికృష్ణ పేర్లు చెప్పారు. అప్పుడే ఇంటిలోకి వచ్చిన శిల్పా చక్రవర్తి సైతం నామినేషన్ ప్రక్రియలో పాల్గొని అలీరేజా, శ్రీముఖి లను నామినేట్ చేసింది. ఈ వారం అలీరేజా, రవికృష్ణ, శ్రీముఖి, రాహుల్, మహేష్ ఎలిమినేషన్ ప్రాసెస్ లో ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here