తెలుగు సినీ ప్రియులు, భారతీయ సినిమా ప్రేక్షకులందరూ ఎదురుచూస్తున్న పుష్ప 2: ది రూల్ ట్రైలర్ సెన్సేషన్‌ను సృష్టించింది. బీహార్‌లోని పాట్నాలో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో ఈ ట్రైలర్ విడుదల కాగా, కేవలం కొన్ని గంటల్లోనే ఇది యూట్యూబ్‌లో సంచలన రికార్డులు సృష్టించింది.
2 నిమిషాల 44 సెకన్ల నిడివితో కూడిన ఈ ట్రైలర్‌లో, దర్శకుడు సుకుమార్ తన సృష్టించుకున్న పాత్రలను మరింత డెప్త్ తో చూపించి ప్రేక్షకుల అంచనాలను అమాంతం పెంచేశారు. అల్లు అర్జున్ పుష్పరాజ్ పాత్రలో మరోసారి తన మ్యానరిజం, పవర్‌ఫుల్ యాక్టింగ్‌తో అభిమానులను మంత్ర ముగ్ధులను చేశారు. ట్రైలర్‌లో అల్లు అర్జున్ యాక్షన్, డైలాగులు అభిమానులకు గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని ట్రైలర్ స్పష్టంగా తెలుస్తోంది. బీజీఎమ్ అందించిన వేరే లెవల్ లో ఉంది.
రికార్డులు బద్దలు:
ఈ ట్రైలర్ విడుదలైన తర్వాత కేవలం 12 గంటల్లో 60 మిలియన్ల వ్యూస్ సాధించి దక్షిణ భారతదేశంలో అత్యధికంగా వీక్షించిన ట్రైలర్‌గా నిలిచింది. ఇందులో తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషల్లో వచ్చిన వ్యూస్ ఉన్నాయి. 1.4 మిలియన్ల లైక్స్ ద్వారా ప్రేక్షకుల ఆదరణను ఇది అందుకుంది. మహేశ్ బాబు గుంటూరు కారం ట్రైలర్ రికార్డును బద్దలు కొడుతూ, పుష్ప 2 ట్రైలర్ కొత్త స్టాండర్డ్స్‌ను స్థాపించింది.
అల్లు అర్జున్ పుష్పరాజ్‌గా, రష్మిక మందన్న అతని ప్రేమికురాలిగా కనిపిస్తారు. ఫహద్ ఫాజిల్, అనసూయ, సునీల్, రావు రమేశ్, జగపతి బాబు వంటి తారాగణం కీలక పాత్రలలో మెరిశారు. పుష్ప: ది రైజ్‌లో తక్కువ స్క్రీన్ టైమ్ ఉన్న ఫహద్ ఫాజిల్ ఈ సీక్వెల్‌లో బలమైన పాత్రలో కనిపించనున్నారు.
సెలబ్రిటీల ప్రశంసలు:
పుష్ప 2 ట్రైలర్‌పై ప్రముఖ దర్శకులు బుచ్చిబాబు, హరీష్ శంకర్, అనిల్ రావిపూడి, ప్రశాంత్ వర్మ, మరియు కన్నడ హీరో రిషభ్ శెట్టి వంటి వారు తమ ప్రశంసలను వ్యక్తం చేశారు. “ప్రతి ఫ్రేమ్‌లో సుకుమార్ సర్ ప్రతిభ అద్భుతంగా చూపించారు” అంటూ దర్శకులు వ్యాఖ్యానించారు.
ఇంటర్నేషనల్ లెవల్:
పుష్ప ట్రైలర్‌పై ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, అల్లు అర్జున్‌ను అభినందించాడు. పుష్ప: ది రూల్ నేషనల్‌ను దాటిపోయి ఇంటర్నేషనల్ క్రేజ్ పొందుతుందని అభిమానులు విశ్వసిస్తున్నారు.
డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2: ది రూల్ 1000కి పైగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ ట్రైలర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను సృష్టించడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద మైలు రాయిగా నిలుస్తుందనే నమ్మకాన్ని కలిగిస్తోంది.