సినిమా రిలీజై నెల రోజులు దాటినా ఇంకా పుష్ప హవా ఇంకా ఏమాత్రం తగ్గలేదు. బాహుబలి , కేజీఎఫ్‌ల తర్వాత ఆ స్థాయిలో సీక్వెల్‌పై అంచనాలు క్రియేట్ చేసిన సినిమా.. పుష్ప2 . అప్పుడెప్పుడో మూడేళ్ల కిందట ఎలాంటి అంచనాల్లేకుండా రిలీజై హిందీ బెల్టుపై 100 కోట్లు కొల్లగొట్టి సంచలనాలు సృష్టించింది. సరిగ్గా మూడేళ్లకు సీక్వెల్‌తో బాక్సాఫీస్ బద్దలు కొడుతున్నాడు అల్లు అర్జున్. దీంతో అసలు ఏ రికార్డు కూడా మిగలడం లేదు. వీకెండ్ వచ్చిందంటే చాలు.. కలెక్షన్ల మోత మోగుతుంది.
30 రోజులుగా పుష్ప2 సినిమా సునామీ యావత్ ఇండియా థియేటర్లను చుట్టేసింది. కొత్త సినిమాలు ఎన్ని రిలీజవుతున్న పుష్ప2 దాటికి సౌండ్ కూడా వినిపించడం లేదు. ఆ ఏరియా ఈ ఏరియా అని కాకుండా.. అన్ని ఏరియాల్లోనూ పుష్ప హవా కొనసాగుతుంది. సౌత్ టు నార్త్ వరకు ఏ రికార్డును కూడా వదలడం లేదు. పుష్పరాజ్ దాటికి ఒక్క టాలీవుడ్ మాత్రమే కాదు.. బాలీవుడ్ రికార్డులు సైతం చెల్లా చెదురవుతున్నాయి.
పుష్ప 2 మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లే రాబడుతోంది. ఇప్పడు 2వేలకోట్ల మార్క్ కు అతి దగ్గర్లో ఉంది. లేటెస్ట్గా పుష్ప 2 మూవీ 32 రోజుల కలెక్షన్స్ను అనౌన్స్ చేస్తూ మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. పుష్ప 2 మూవీ భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యధిక కలెక్షన్లతో హిట్ అయింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 32 రోజుల్లో 1831 కోట్ల గ్రాస్‌ను సాధించిందంటూ మేకర్స్ వివరాలు వెల్లడించారు.
హిందీలో రిలీజైన కేవలం 15 రోజులకే వాళ్ల సినిమాలను సైతం బీట్ చేసి ఇండస్ట్రీ హిట్టు కొట్టింది. బాలీవుడ్‌లో ఇండస్ట్రీ హిట్టు కొట్టడం అంటే మాములు విషయం కాదు. రీసెంట్‌గా ఈ సినిమా ఏకంగా 800 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఒక తెలుగు డబ్బింగ్ సినిమా.. హిందీలో 800 కోట్లు కొల్లగొట్టడం అంటే మాములు విషయం కాదు. ఈ సినిమా జోరు చూస్తుంటే.. ఫైనల్ రన్‌లో 1000 కోట్ల కలెక్షన్లు రాబట్టేలా కనిపిస్తుంది.
ఇక ఆల్ టైం రికార్డ్స్ చూసుకుంటే బాహుబలి 2 వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 1788.06 కోట్లు. బాలీవుడ్ మూవీ దంగల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 2000 కోట్లు. అంటే, నిన్నటివరకు దంగల్ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రం బాహుబలి 2. ఇక ఇప్పుడు పుష్ప 2 వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 1831 చేరడంతో.. బాహుబలి 2 రికార్డ్స్ బీట్ చేసి రెండో స్థానంలో నిలిచింది. మొత్తానికి పుష్పరాజ్ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు.