ప్రముఖ నటుడు, ఏపీ ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ పోసాని కృష్ణమురళికి కరోనా.. హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స

Actor cum APFDC Chairman Posani Krishna Murali Admitted To Hospital After Tested Positive For Covid-19,Actor cum APFDC Chairman Posani Krishna Murali,Posani Krishna Murali Admitted To Hospital,Posani Krishna Murali Tested Positive For Covid-19,Mango News,Mango News Telugu,Posani Krishna Murali Tests Positive,Actor Posani Krishna Murali Latest News,Corona for Posani Krishna Murali,Posani Admitted To Hospital,APFDC Chairman Posani Krishna Murali,Posani Krishna Murali Live News,India Coronavirus Statistics,Official Updates Coronavirus,Information about COVID-19,India Covid Last 24 Hours Report,Active Corona Cases

ప్రముఖ టాలీవుడ్ నటుడు, ఏపీ ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ పోసాని కృష్ణమురళి కరోనా బారిన పడ్డారు. ఇటీవల ఓ సినిమా షూటింగ్‌ కోసం పుణె వెళ్లిన ఆయన గురువారం రాత్రి హైదరాబాద్‌ చేరుకున్నారు. అనంతరం దగ్గు, జలుబు వంటి లక్షణాలు ఉండడంతో టెస్ట్‌ చేయించుకోగా కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో ఆయన హైదరాబాద్‌ ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. అయితే పోసాని ఆరోగ్యం ప్రస్తుతానికి నిలకడగా ఉందని, మరికొన్ని రోజుల్లోనే డిశ్చార్జ్ అవుతారని ఏఐజీ వైద్యులు తెలిపారు. కాగా గతంలో కూడా పోసాని కృష్ణమురళికి కరోనా సోకిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయనకు కరోనా సోకడం ఇది మూడోసారి. ఇక మరోవైపు తెలంగాణలో క్రమంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. నిన్న 45 కరోనా కేసులు నమోదు కాగా.. వీటిలో హైదరాబాద్‌లోనే 18 కేసులు ఉన్నాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ సూచనలు చేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here