బాలకృష్ణ సినీ కెరీర్ లోనే కాదు, తెలుగు సినీ ఇండస్ట్రీలోనే.. ఒక మైలురాయిగా నిల్చిపోయిన సినిమాలో ఒకటి ఆదిత్య 369 ఒకటి అని గర్వంగా చెప్పొచ్చు. సింగీతం శ్రీనివాసరావు డైరక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా ఆ రోజుల్లో ఒక సెన్సేషన్ క్రియుట్ చేసింది. టైం ట్రావెల్ కాన్సెప్ట్ మీద మన దేశంలో తెరకెక్కిన మొట్టమొదటి సైన్స్ ఫిక్షన్ మూవీ కావడంతో ఫ్యాన్స్‌తో సంబంధం లేకుండా చిన్నా,పెద్దా ఇలా అన్ని వర్గాలు ఈ సినిమాను చూడటానికి క్యూ కట్టారు. అయితే ఈ చిత్రానికి సీక్వెల్ తీస్తానని బాలకృష్ణ ఎప్పుడో అధికారికంగా అనౌన్స్ చేశాడు.
తాజాగా ఈ సినిమాకి ఆదిత్య 999 అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. తన వారసుడు మోక్షజ్ఞని హీరోగా పెట్టి తీసే ఆలోచనలో బాలయ్య ఉన్నాడు. ఈ చిత్రానికి బాలకృష్ణే దర్శకత్వం వహించబోతున్నాడట. వచ్చే ఏడాది సెకండాఫ్‌లో ఈ సినిమా ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్రానికి బాలయ్య నిర్మాతగా వ్యవహరించడమే కాకుండా,డైరక్షన్ కూడా చేయబోతున్నాడు. రీసెంట్ గా అన్ స్టాపబుల్ 4 లో బాలయ్యే ఈ విషయాలను వెల్లడించినట్టు తెలుస్తుంది.
ఇది ఇలా ఉండగా ఇది మోక్షజ్ఞ రెండవ సినిమాగా రానుంది. మోక్షజ్ఞ మొదటి సినిమా, హనుమాన్ డైరక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ మోక్షజ్ఞ బర్త్ డేకు విడుదల చేయగా.. దానికి ఫ్యాన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అల్ట్రా స్టైలిష్ లుక్ లో మోక్షజ్ఞ లుక్‌ని చూసిన అభిమానులు సంబరాలు చేసుకున్నారు.
ఈ సినిమాలో బాలకృష్ణ అర్జునుడి క్యారక్టర్ లో కనిపించనుండగా..మోక్షజ్ఞ అభిమన్యుడి క్యారక్టర్ లో కనిపిస్తాడు. శ్రీ కృష్ణుడి పాత్రలో మాత్రం నందమూరి తారక రామారావును ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారు. అయితే ఇది మొత్తం మోడరన్ ఎరాలోనే తెరకెక్కించనున్నారు. మోడరన్ ఎరాలో తెరకెక్కిస్తున్న ఈ మూవీకి , మహాభారతంలోని క్యారెక్టర్స్ కి అసలు సంబంధం ఏమిటనేది టీజర్, ట్రైలర్ వచ్చే వరకు సస్పెన్స్‌గానే ఉంచుతున్నారు మేకర్స్.