గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ

Balasubrahmanyam, Balasubrahmanyam Tests Positive, Singer SP Balasubrahmanyam, Singer SP Balasubrahmanyam tests coronavirus positive, SP Balasubrahmanyam, SP Balasubrahmanyam coronavirus positive, SP Balasubrahmanyam Tests Positive for COVID-19

కరోనావ్యాప్తి రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలువురు సినీ ప్రముఖులు సైతం కరోనా వైరస్ బారిన పడుతున్నారు. ఈ క్రమంలో ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఓ వీడియో ద్వారా వెల్లడించారు. గత మూడు రోజులుగా అస్వస్థతగా ఉండటంతో కరోనా పరీక్షలు చేయించుకోగా, రిపోర్ట్ పాజిటివ్ గా వచ్చిందని ఎస్పీ బాలు తెలిపారు. వైద్యులు హోం క్వారంటైన్‌లో ఉండమని సూచించారని, అయితే ఇతర కుటుంబ సభ్యులకు ఇబ్బంది కలగకుండా ఆస్పత్రిలో చేరినట్లు వెల్లడించారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, ఎవరూ ఆందోళన చెందవద్దని ఎస్పీ బాలు పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu