అయోధ్యలో అద్భుత ఘట్టం: రామమందిరం నిర్మాణానికి వైభవంగా భూమిపూజ

ayodhya, Ayodhya Ram Mandir, Ayodhya Ram Mandir Bhoomi Pujan Live Updates, Ayodhya Ram temple bhoomi pujan, Ayodhya temple bhoomi pujan, PM Modi Offers Prayers at Hanuman Garhi Temple, pm narendra modi, Ram Mandir, Ram Mandir Bhoomi Puja, Ram Mandir Bhoomi Pujan, Ram Mandir Bhoomi Pujan Live, Ram Mandir Bhoomi Pujan Live Updates

అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. రామమందిరం నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా భూమి పూజ వైభవంగా జరిగింది. వేదపండితుల మంత్రాల నడుమ పీఎం మోదీ శంకుస్థాపన చేశారు. ముందుగా రామమందిరం భూమి పూజ‌లో భాగంగా నిర్వహించిన శిలాపూజ‌లో ప్రధాని మోదీ, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహ‌న్ భ‌గ‌వ‌త్, గ‌వ‌ర్న‌ర్ ఆనందీబెన్ ప‌టేల్ సహా పలువురు పీఠాధిపతులు పాల్గొన్నారు.

వేదం పండితులు మంత్రాలు చ‌దువుతూ పీఎం మోదీ చేతుల మీదుగా పూజ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. భూమి పూజ వద్ద తొమ్మిది ఇటుకలను ఉంచారు, వీటిని 1989 లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామ భక్తులు పంపారని, అలాంటి ఇటుకలు మొత్తం 2 లక్షల 75 వేలు ఉన్నాయని, వీటిలో 100 ఇటుకలపై ‘జై శ్రీ రామ్’ అని చెక్కడం జరిగిందని భూమి పూజ నిర్వహించే పూజారి వెల్లడించారు. ఈ భూమి పూజ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా భక్తులు వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. అలాగే దేశంలో అన్ని రామాలయాల్లో ప్రత్యేక ప్రార్థనలు, పూజలు నిర్వహించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − 6 =