ప్రపంచ దేశాల్లో బీఏ.2 ఒమిక్రాన్ వేరియెంట్ ఆందోళన.. పెరుగుతున్న పాజిటివ్ కేసులు

Omicron BA.2 Strain on Rise in Several Countries Indication For Covid 4th Wave, Omicron BA.2 Strain on Rise in Several Countries, Omicron BA.2 Strain on Rise Indication For Covid 4th Wave, Covid 4th Wave, Omicron BA.2 Strain, BA.2 Strain, Covid-19 Updates, Covid-19 Live Updates, Covid-19 Latest Updates, Coronavirus, Coronavirus Updates, COVID-19, COVID-19 Live Updates, Covid-19 New Updates, Omicron BA.2 Strain Cases, Omicron BA.2 Strain variant, Omicron Cases, Omicron, Update on Omicron, Omicron covid variant, Omicron variant, Mango News, Mango News Telugu,

ప్రపంచ దేశాలపై కరోనా మళ్లీ విరుచుకుపడనుందా? మనదేశంలో మళ్ళీ 4th వేవ్ రానుందా? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఈ అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే ప్రపంచదేశాల్లో మళ్ళీ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. అయితే ఈసారి బీఏ.2 వేరియెంట్ రూపంలో ఆందోళన కలిగిస్తోంది. ఒమిక్రాన్ సబ్‌వేరియంట్ BA.2 కేసులు అమెరికాలో పెరిగిపోతున్నాయి. గత రెండు వారాలుగా కోవిడ్-19 పరీక్షలలో BA.2 వేరియంట్‌ కేసుల పెరుగుదల అత్యధికంగా ఉంటోంది. హెలిక్స్, శాన్ డియాగో-ఆధారిత జెనోమిక్స్ సంస్థ, BA.2 వేరియంట్‌ను అమెరికాలో మొదటిసారిగా జనవరి ప్రారంభంలో గుర్తించింది.

మొదట్లో దీని ప్రభావం అంతగా లేకపోయినా ఇప్పుడు దేశవ్యాప్తంగా మొత్తం కోవిడ్ కేసుల్లో 50% నుండి 70% వరకు నమోదవుతున్నట్లు హెలిక్స్ అంచనా వేసింది. అమెరికాతోపాటు యూరప్, ఫ్రాన్స్, యూకే మరియు జర్మనీలలో దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. మరోవైపు కరోనా పుట్టినిల్లయిన చైనాలో కూడా ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఆంక్షలను మరింతగా పెంచింది. ఇప్పటికే పలు నగరాలు లాక్‌డౌన్‌లో ఉన్నాయి. షాంఘైలో వరుసగా రెండో రోజు రికార్డు స్థాయిలో కోవిడ్ కేసులు నమోదయ్యాయి. గత ఏడు రోజుల్లో ఫ్రాన్స్ లో సగటున 90,000 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + five =