అన్నపూర్ణ స్టూడియోస్ లో ‘అన్ స్టాపబుల్ 4’ లేటెస్ట్ ఎపిసోడ్ పూర్తయ్యింది. ఈ ఎపిసోడ్ కి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. డిసెంబర్ 31వ తేదీ ఉదయం పది గంటలకు మొదలైన ఎపిసోడ్ షూటింగ్, సాయంత్రం 6 గంటలకు కంప్లీట్ అయింది. ఈ ఎపిసోడ్ లో చెర్రీ, బాలయ్య మధ్య జరిగిన సరదా చిట్ చాట్ అద్భుతంగా వచ్చిందన్న టాక్ నడుస్తోంది. ఈ ఎపిసోడ్ లో రామ్ చరణ్ ప్రాణ స్నేహితులయిన శర్వానంద్, వికాస్ కూడా పాల్గొన్నారు. ఈ ముగ్గురితో బాలయ్య కొన్ని టాస్కులు ఆడించగా.. ఈ ముగ్గురు కలిసి ఉన్నంతసేపు సెట్స్ మొత్తం ఫన్ తోనే మునిగిపోయిందట. బాలయ్య కూడా వాళ్ళతో కలిసి అదిరిపోయే రేంజ్లో జోకులు వేసారట. చూస్తున్నంతసేపు కన్నుల పండుగగా ఈ ఎపిసోడ్ సాగుతుందట.
గత సీజన్ లో ప్రభాస్ గెస్టుగా వచ్చినప్పుడు రామ్ చరణ్ కి కాల్ చేస్తాడు.అప్పుడు చరణ్ ఫోన్ కాల్ లో ప్రభాస్ తో ఏ రేంజ్ లో ఆడుకున్నాడో మన అందరికీ తెలిసిందే. తర్వాత వస్తావ్ గా అన్ స్టాపబుల్ షోకి, అప్పుడు బాలయ్య నాకే ఫోన్ చేస్తారు, అప్పుడు చెప్తా నీ పని అంటూ అప్పుడు ప్రభాస్ కౌంటర్ ఇస్తాడు. ఆ కామెంట్స్ కి తగ్గట్టే ఈ ఎపిసోడ్‌లో ప్రభాస్ కు బాలయ్య ఫోన్ చేయగా.. రామ్ చరణ్ ని ఒక రేంజ్ లో ఆట పట్టించాడని తెలుస్తుంది. ‘ఒరేయ్ చరణ్..భలే దొరికావ్ రా’ అంటూ ప్రభాస్ ఫన్నీ గా ఫోన్ కాల్ సంభాషణ జరిపాడట. ఈ సమయంలో రామ్ చరణ్ కి సంబంధించిన కొన్ని సీక్రెట్స్ ప్రభాస్ లీక్ చేసాడట.
ఈ ప్రోమో ఈరోజు లేదా రేపు విడుదల చేయబోతున్నారు. ఈ ఎపిసోడ్ కూడా రెండు భాగాలుగా ఉంటాయట. చరణ్ తన చిన్న నాటి విశేషాలు, తన తండ్రి చిరంజీవి, బాబాయ్ పవన్ తో ఉన్న బాండింగ్ గురించి చాలా ఎమోషనల్ గా చెప్పాడని టాక్ నడుస్తోంది. అంతే కాకుండా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న రోజు, మోదీతో తన అన్నయ్య చిరంజీవి చేతులు పట్టుకొని పైకి లేపిన సందర్భాన్ని గుర్తు చేసుకుని చరణ్ చాలా గొప్పగా చెప్పాడట. మొత్తంగా ఈ ఎపిసోడ్ అన్ స్టాపబుల్ ది బెస్ట్ గా ఉండబోతుందని తెలుస్తుంది. ఈ ఎపిసోడ్ లో నిర్మాత దిల్ రాజు కూడా పాల్గొని.. ‘గేమ్ చేంజర్’ కి సంబంధించిన విశేషాలు షేర్ చేసుకున్నారట.