పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి, పవన్‌కు ఉన్న ఫాలోయింగ్ గురించి అందరికీ బాగా తెలుసు. ఒక వైపు పవన్ కల్యాణ్ సినిమాలు చేస్తూ.. మరో వైపు రాజకీయాలలో కూడా సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలిచిన పవన్ ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ.. ఒక డిప్యూటీ సీఎంగా కూడా ప్రజలకు ఇలా ప్రయోజనాలు చేయొచ్చా అని నలుగురు ఆశ్చర్యపోయేలా చేస్తున్నారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్.. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు మరికొన్ని కీలక పదవులను కూడా చేపట్టారు.
ఇక ఇప్పటివరకు తన సినిమా కెరియర్లో ఎన్నో రీమేక్ సినిమాలు కూడా హిట్లు కొట్టారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్.. ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాను స్టార్ట్ చేశారు. మైత్రి సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీలో శ్రీ లీల హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టిన తర్వాత.. కొంత భాగం పూర్తయ్యాక పవన్ తన దృష్టి మొత్తం రాజకీయాలపై పెట్టడంతో ఈ సినిమా షూటింగ్‌కు బ్రేక్ పడింది.
ఇక తాజాగా పవన్ కల్యాణ్.. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కోసం బల్క్ డేట్స్ ఇచ్చినట్లు.. దాంతో ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఇదిలా ఉంటే మరోపక్క పవన్ కల్యాణ్ నటిస్తున్న ఈ సినిమా.. తేరీ అనే హిందీ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కనున్నట్లు టాక్ వినిపిస్తుంది.
షూటింగ్ లేటవడం వల్ల రిలీజ్ కూడా లేటవుతోంది.
ఇంతలో అదే తేరి సినిమాకు రీమేక్ గా హిందీలో వరుణ్ ధావన్ హీరోగా నటించిన బేబీ జాన్ మూవీ ఈ డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది.ఈ బేబీ జాన్ సినిమాకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. అయితే బేబీ జాన్ మూవీ ఒరిజినల్ సినిమా అయినా తేరీ స్టోరీని ఏమాత్రం మార్చకుండా..కేవలం యాక్షన్ సన్నివేశాలను మాత్రం భారీ భారీ బడ్జెట్ తో తీశారట. ఈ మూవీకి ఇప్పుడు బాలీవుడ్‌లో ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందట.
ఒకవేళ పవన్ కల్యాణ్ కూడా తేరీ మూవీకి రీమేక్‌గా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కనుక చేస్తున్నట్లయితే.. చాలా చేంజెస్ చేయాల్సిన అవసరం ఉందని పవన్ ఫ్యాన్స్‌తో పాటు మూవీ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. హరీష్ శంకర్ డైరక్ట్ చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ త్వరలోనే షూటింగ్ పూర్తి చేసుకొని ఆడియన్స్ ముందుకు రానుంది. మరి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో వేచి చూడాలి.