మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్ ఎన్నికలు: నామినేషన్ వేసిన నటుడు మంచు విష్ణు, ప్యానెల్ సభ్యులు

Actor Manchu Vishnu and his Panel Members Filed Nominations Today, Hero Manchu Vishnu Panel Files Nomination For MAA Elections, MAA Elections, MAA Elections 2021, MAA Elections News, Manchu Vishnu and his Panel Members Filed Nominations, Manchu Vishnu and Panel Members File Nominations, Manchu Vishnu Panel Files Nomination for MAA Elections 2021, Manchu Vishnu panel for MAA Elections, Manchu Vishnu Panel Members File Nomination, Mango News, Tollywood’s MAA elections

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్ (మా) ఎన్నికలు రోజురోజుకి రసవత్తరంగా మారుతున్నాయి. అక్టోబర్ 10వ తేదీన ఎన్నికలు జరగనుండగా, ప్రస్తుతం నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ‘మా’ అధ్యక్ష పదవికి పోటీచేస్తున్న నటుడు మంచు విష్ణు మంగళవారం తన నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా మంచు విష్ణు తన నివాసం నుంచి ఫిల్మ్‌ ఛాంబర్‌ వరకు ర్యాలీగా వెళ్లారు. అనంతరం ‘మా’ కార్యాలయంలో ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌ కు నామినేషన్ పత్రాలను అందజేశారు. మంచు విష్ణుతో పాటుగా తన ప్యానల్‌ సభ్యులు కూడా నామినేషన్స్ దాఖలు చేశారు.

మరోవైపు ‘మా’ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న నటుడు ప్రకాశ్‌ రాజ్‌ మరియు అతని ప్యానెల్ సభ్యులు సోమవారం నామినేషన్స్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ప్రముఖ నటుడు సీవీఎల్‌ నరసింహారావు అధ్యక్ష పదవికి, నటుడు బండ్ల గణేష్ ఇండిపెండెంట్ గా జనరల్ సెక్రటరీ పదవికి నామినేషన్‌ దాఖలు చేశారు. ‘మా’ ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం సెప్టెంబర్ 29 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. అలాగే సెప్టెంబర్ 30న నామినేషన్ల పరిశీలన జరగనుండగా, అక్టోబర్‌ 2వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్‌ల ఉపసంహరణకు గడువిచ్చారు. అక్టోబర్ 2వ తేదీ సాయంత్రం బరిలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. ఇక అక్టోబర్ 10న ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో ‘మా’ ఎన్నికలను నిర్వహించనున్నారు. అదేరోజు రాత్రి ఏడు గంటలకు ఫలితాలను ప్రకటించనున్నారు.

మంచు విష్ణు ప్యాన‌ల్‌ :

  • ప్రెసిడెంట్ : మంచు విష్ణు
  • ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ – బాబు మోహన్
  • జనరల్‌ సెక్రటరీ – రఘుబాబు
  • వైస్‌ ప్రెసిడెంట్‌ – మాదాల రవి
  • వైస్‌ ప్రెసిడెంట్‌ – పృథ్వీరాజ్
  • జాయింట్‌ సెక్రటరీ – కరాటే కళ్యాణి
  • జాయింట్‌ సెక్రటరీ – గౌతమ్ రాజు
  • ట్రెజరర్‌ – శివ బాలాజీ

ఎగ్జిక్యూటివ్‌ కమిటీ మెంబెర్స్:

  • అర్చన
  • గీతా సింగ్
  • అశోక్ కుమార్
  • సంపూర్ణేష్ బాబు
  • హరినాథ్ బాబు
  • జయవాణి
  • మలక్ పేట శైలజ
  • మాణిక్
  • పూజిత
  • రాజేశ్వరి రెడ్డి
  • రేఖ
  • శశాంక్
  • శివన్నారాయణ
  • శ్రీలక్ష్మి
  • శ్రీనివాసులు.పి
  • స్వప్న మాధురి
  • విష్ణు బోప్పన్న
  • వడ్లపట్ల ఎం.ఆర్.సీ
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + 15 =