కేజీఎఫ్ చాప్టర్2, అధీరా గా సంజయ్ దత్

Sanjay Dutt's First Look Out From KGF Chapter 2,Sanjay Dutt First Look,Sanjay Dutt First Look From KGF,Sanjay Dutt First Look From KGF Chapter 2,Sanjay Dutt First Look Out From KGF,Sanjay Dutt Movies,Sanjay Dutt Latest Movies,KGF,KGF Chapter 2, Adheera, Sanjay Dutt As Adheera, Sanjay Dutt As Adheera In KGF chapter 2

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో యశ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కేజీఎఫ్’. గత సంవత్సరం విడుదలై బాక్సాఫీస్ దగ్గర ఘనమైన రికార్డ్స్ సృష్టించిన ఈ చిత్రంయొక్క రెండో భాగం ‘కేజీఎఫ్ -2’ చిత్రీకరణ జరుపుకుంటుంది. కేజీఎఫ్ హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో కూడా ఘన విజయం సాధించడంతో, రెండవ చాప్టర్ లో ప్రత్యేక శ్రద్ద తీసుకొని అన్ని భాషలకు చెందిన నటులను తగిన పాత్రలకు ఎంచుకున్నారు. కేజీఎఫ్-2 చిత్రంలో మెయిన్ విలన్ అధీరా ఫస్ట్ లుక్ ను చిత్ర బృందం ఈరోజు విడుదల చేశారు. అధీరా పాత్రను ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ పోషిస్తున్నారు.

ఈ రోజు సంజయ్ దత్ పుట్టినరోజుని పురస్కరించుకుని సినిమాలో ఆయన లుక్ ని విడుదల చేసారు. తలపాగా చుట్టుకొని కళ్ళు మాత్రమే కనిపించే విధంగా ఉన్న సంజయ్ దత్ లుక్ అభిమానులు, ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ రాబట్టుకుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి నటిస్తుండగా, హోంబళే ఫిలిమ్స్, వారాహి చలన చిత్ర సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అద్భుతమైన మాస్ సన్నివేశాలతో రూపొందించిన కేజీఎఫ్ సంచలన విజయం సాధించడంతో, కేజీఎఫ్ చాప్టర్-2 పై ప్రేక్షకులకు భారీ అంచనాలు ఉన్నాయి. మొదటిభాగం తో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న యశ్ కు, ఇప్పుడు సంజయ్ దత్ కూడ తోడవడంతో వారి మధ్య పోరు కొరకు అభిమానులు ఎదురు చూస్తున్నారు, కేజీఎఫ్-2 చిత్రం ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here