భారత్ లోకి ఎంటరైన ఒమిక్రాన్

2 cases of new variant of coronavirus detected, Covid B.1.1.529 variant, covid-19 new variant, India, Mango News, New Coronavirus Strain, New Covid 19 Variant, New Covid Strain Omicron, Omicron, Omicron covid variant, Omicron variant, omicron variant in India, omicron variant south africa, Two cases of Omicron variant detected in India so far, Two Omicron Cases Detected Says Union Govt, Update on Omicron

ప్రపంచ దేశాలని వణికిస్తున్న కరోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ మన దేశంలో కూడా వెలుగు చూసింది. విదేశాల నుంచి కర్ణాటక వచ్చిన ఇద్దరు పురుషులలో ఈ వేరియెంట్ ని గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. విదేశాల నుంచి వచ్చిన వీరిద్దరికీ మొదట కోవిడ్ పాజిటివ్ గా తేలటంతో ఆ నమూనాలని జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం ల్యాబ్ కి పంపించారు. ఇప్పుడు వారిద్దరిలో ఒమిక్రాన్ వేరియెంట్ ఉన్నట్లు గుర్తించారు. ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులని కూడా గుర్తించి, వారికి కూడా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఒమిక్రాన్ వేరియెంట్ గుర్తించిన ఇద్దరిలోను తీవ్ర లక్షణాలు లేవని, స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపించినట్లు ప్రకటించారు. కాగా, దీని గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని, తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. భౌతిక దూరం పాటించటం, తప్పనిసరిగా మాస్క్ లు ధరించటం, అందరూ వాక్సిన్ వేయించుకోవటం ద్వారా సురక్షితంగా ఉండొచ్చని తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ