రామమందిరం నిర్మాణానికి ఆగస్టు 5న భూమిపూజ,150 మంది అతిథులు

150 Guests Attend Bhoomi Puja Ceremony of Ram Mandir, ayodhya, Bhoomi Puja Ceremony, Bhoomi Puja Ceremony of Ram Mandir, Bhoomi Puja Ceremony of Ram Mandir in Ayodhya, Ram Mandir, Ram Mandir Bhoomi Puja Ceremony, Ram Mandir in Ayodhya

అయోధ్యలో నిర్మించనున్న రామమందిరం నిర్మాణానికి ఆగస్టు 5, బుధవారం నాడు ప్రధాని నరేంద్ర మోదీ భూమి పూజ చేయనున్నారు. అయితే ప్రస్తుత కరోనా వ్యాప్తి పరిస్థితుల దృష్ట్యా భూమి పూజ కార్యక్రమానికి ఎక్కువ మందిని ఆహ్వానించకూడదని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం ట్రస్టు నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించనున్నారు. వీరితో కలుపుకుని 150 మంది అతిథులు సహా 200 మందితోనే భూమి పూజ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. మరోవైపు శంకుస్థాపన కంటే ముందుగా రామమందిరంలో, హనుమాన్ ఆలయంలో ప్రధాని మోదీ ప్రార్థనలు నిర్వహించనున్నారు. అలాగే రామమందిరం నిర్మాణ ఉద్యమంతో దేశవ్యాప్తంగా సంబంధం కలిగిన పలువురు కీలక నేతలను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu