ఇప్పటికీ 15 వేలకు పైగా పోలీసులకు కరోనా పాజిటివ్

Maharashtra, Maharashtra Coronavirus, Maharashtra Coronavirus Positive Cases, Maharashtra Coronavirus Updates, Maharashtra Police, Maharashtra Police Coronavirus, Maharashtra Police Personnel Test Positive, Maharashtra Police Personnel Tested Positive, Maharashtra Police Tested Positive

మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఇప్పటికీ 15294 మంది పోలీసులకు కరోనా వైరస్‌ సోకిందని ఆ రాష్ట్ర పోలీస్‌ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. కాగా ఇందులో 12306 మంది పూర్తిగా కోలుకున్నారని, 156 మంది పోలీసులు మరణించారని తెలిపారు. కరోనా నుంచి కోలుకున్నవారిలో 1247 మంది అధికారులు, 11059 మంది పోలీస్ సిబ్బంది ఉన్నారు. అలాగే ఈ వైరస్‌ వలన మరణించిన వారిలో 15 మంది అధికారులు, 141 మంది సిబ్బంది ఉన్నారు. 377 మంది పోలీసు అధికారులు, 2455 మంది పోలీస్ సిబ్బందితో కలిపి మొత్తం 2832 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్టు పోలీస్‌ శాఖ వెల్లడించింది. ఇక మహారాష్ట్ర రాష్ట్రంలో ఆగస్టు 30, ఆదివారం నాటికి మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,80,689 కి చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 24,399 కి పెరిగింది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu