కేరళ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కేరళలోని మలప్పురం జిల్లాలోని రెండు పాఠశాలల్లో 192 మంది 10వ తరగతి విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అలాగే 72 మంది సిబ్బంది కూడా కరోనా బారిన పడ్డారు. కాగా పాజిటివ్ గా తేలిన 192 మంది విద్యార్థుల్లో 91 మంది ఒకే ట్యూషన్ సెంటర్ కు వెళ్తున్నట్టు తేలిందని అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆ రెండు పాఠశాలతో పాటుగా ట్యూషన్ సెంటర్ కూడా మూసివేసినట్టు తెలిపారు.
ఆ ట్యూషన్ సెంటర్ కు వెళ్లే మిగతా విద్యార్థులకు, సమీప పరిసరాలలోని పాఠశాల్లో ఉన్న విద్యార్థులు, టీచర్లకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు. మరోవైపు కేరళ రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 9,77,395 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 9,09,102 మంది కరోనా నుంచి కోలుకోగా, 3,903 మంది మరణించారు. 64,133 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. దేశంలో ప్రస్తుతం అత్యధిక యాక్టీవ్ కేసులు కేరళ రాష్ట్రంలోనే ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ