ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు సత్తా చాటుతున్నారు. అది ఇదీ అని కాకుండా అన్ని రంగాల్లోనూ దూసుకెళ్తున్నారు. దిగ్గజ కంపెనీలకు అధిపతులుగా కొనసాగుతున్నారు. ఎక్కడున్నా తాము తలుచుకుంటే ఏదైనా సాధించగలమని.. తమతో కానిది ఏదీ లేదని రుజువు చేస్తున్నారు. అగ్రరాజ్యాల ఎన్నికల్లో కూడా భారత సంతతికి చెందిన వ్యక్తులు పోటీ చేసి విజయ దుందుభి మోగిస్తున్నారు. ఇటీవల జరిగిన బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో భరత సంతతికి చెందిన వ్యక్తులు సత్తా చాటారు. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా 28 మంది భారత సంతతికి చెందిన వ్యక్తులు పోటీచేసి ఘన విజయం సాధించారు. అలాగే మరికొంత మంది భారత సంతతికి చెందిన వాళ్లు అతి తక్కవ ఓట్ల తేడాతో ఓడిపోయారు.
గురువారం బ్రిటన్‌లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. శుక్రవారం ఫలితాలు వెలువడ్డాయి. గత 14 ఏళ్లుగా బ్రిటన్‌లో అధికారంలో ఉన్న కన్జర్వేటివ్ పార్టీ.. తాజా ఎన్నికల్లో ఓడిపోయి అధికారాన్ని కోల్పోయింది. 14 ఏళ్ల తర్వాత గద్దె దిగిపోయింది. ఎన్నో ఏళ్లుగా అధికారం కోసం ఎదురు చూస్తున్న లేబర్ పార్టీ బ్రిటన్‌లో అధికారంలోకి వచ్చింది. బ్రిటన్‌లో మొత్తం 65 పార్లమెంట్ స్థానాలు ఉండగా.. అందులో 412 స్థానాలను లేబర్ పార్టీ దక్కించుకొని ఘన విజయం సాధించింది. తిరుగులేని ఆధిక్యంతో అధికారంలోకి వచ్చింది. ఇక లేబర్ పార్టీ ఈసారి కేవలం 121 స్థానాలకు మాత్రమే పరిమితమయింది. ముందు నుంచి కూడా ఈసారి కన్జర్వేటివ్ పార్టీ ఓడడం ఖాయమని సంకేతాలు వెలువడ్డాయి. ఎగ్జిట్ పోల్స్‌లో కూడా అదే వెల్లడయింది.
ఇక ఈ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన 28 మంది వ్యక్తులు గెలుపొందారు. మొన్నటి వరకు బ్రిటన్ ప్రధానిగా కొనసాగి భారత సంతతికి చెందిన రిషి సునాక్ మరో సారి రిచ్‌మండ్ అండ్ నార్తర్న్ అలర్టన్ స్థానం నుంచి గెలుపొందారు. తమ పార్టీ ఓడిపోయినప్పటికీ ఆయన మరోసారి ఎంపీగా గెలుపొందారు. అలాగే భారత సంతతికి చెందిన లీసా నాండీ కూడా గెలుపొందారు. ఆమె బ్రిటన్ సాంస్కృతిక, క్రీడల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అలాగే గతంలో హోం శాఖ మంత్రులుగా పని చేసిన సుయెల్లా బ్రేవర్మన్, ప్రీతి పటేల్‌లు మరోసారి ఎంపీలుగా గెలుపొందారు. వీరితో పాటు భారత సంతతికి చెందిన గగన్ మహీంద్ర, శివాని రాజా, క్లెయిర్ కౌటిన్హో, సీమా మల్హోత్రా, వాలెరీ వాజ్, కీత్ వాజ్, నావెందు మిశ్ర, రదిమా విటోమ్‌లు విజయం సాధించారు. గెలుపొందిన భారత సంతతి ఎంపీల్లో ఎక్కువ మంది అధికారంలోకి వచ్చిన లేబర్ పార్టీకి చెందిన వారే ఉన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY