
వాయు కాలుష్యం వల్ల దేశ రాజధాని ఢిల్లీలో ప్రతీ సంవత్సరం 11.5 శాతం అంటే దాదాపుగా 12,000 మంది మరణించి ఉండొచ్చని ప్రముఖ వైద్య పరిశోధన మాసపత్రిక లాన్సెట్‌లో ప్రచురితమైన ఓ రిపోర్ట్ చెబుతోంది.అయితే కాలుష్యం వల్ల దేశంలో అత్యధిక మరణాలు సంభవిస్తుంది మాత్రం ఢిల్లీలోనే అని తెలిపింది. భారత్‌లోని అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్‌కతా, ముంబై, పూనే, సిమ్లా, వారణాసి ఇలా 10 నగరాలలో అధ్యయనం చేశారు. ఏటా ఈ నగరాల్లో వాయు కాలుష్యంతో సుమారు 33 వేల మరణాలు సంభవించి ఉండొచ్చని లాన్సెట్ నివేదిక తెలిపింది.
సిమ్లాలో అత్యల్పంగా 59 మంది మరణించినట్లు చెప్పిన లాన్సెట్ నివేదిక.. అక్కడ సంభవిస్తున్న మరణాల్లో ఇది 3.7 శాతానికి సమానం అని ..కానీ మొత్తం ఈ పది నగరాల్లో నమోదైన మరణాల్లో 7.2 శాతం మరణాలు మాత్రం కాలుష్యం వల్లేనని కుండబద్దలు కొట్టింది.
భారతీయ పరిశోధకులతో పాటు, విదేశీ పరిశోధకులు కూడా కలిసి ఈ అధ్యయనం చేశారు. పది నగరాల్లో పీఎం 2.5 కాలుష్య రేణువుల స్థాయి ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రామాణిక పరిమితులను మించిపోయాయని వీరి నివేదిక వెల్లడించింది. ఏడాదిలో 99.8 శాతం రోజులు ఇదే పరిస్థితి ఉంటోందని ఆందోళ వ్యక్తం చేసింది. 2008 నుంచి 2019 మధ్య చూసుకుంటే ఈ పది నగరాల్లో.. సివిల్ రిజిస్ట్రీల నుంచి మరణాల సమాచారాన్ని అధ్యయన కర్తలు సేకరించారు. నగరాన్ని బట్టి 3 నుంచి ఏడేళ్ల డేటా మాత్రమే వారికి లభించగా..అలా మొత్తం 36 లక్షల మరణాల గురించి వీరు అధ్యయనం చేశారు.
మెషీన్ లెర్నింగ్ టెక్నాలజీతో రూపొందించిన అత్యాధునిక పద్ధతుల ద్వారా పీఎం 2.5 రేణువుల స్థాయిలను అధ్యయన కర్తలు అంచనా వేశారు. పీఎం 2.5 స్థాయిలు ప్రతీ క్యూబిక్ మీటరుకు 10 మైక్రోగ్రాములు పెరిగిన కొద్దీ మరణాలు 1.42 శాతం ఎక్కువైనట్లు అధ్యయన కర్తలు గుర్తించారు. పది సిటీల డేటాను కలిపినప్పుడు ఇలాంటి పరిస్థితిని తాము గుర్తించినట్లు తెలిపారు. విడివిడిగా గమనిస్తే సిటీల మధ్య తేడా భారీగానే ఉందని పేర్కొంది. ఢిల్లీలో మరణాల సంఖ్య 0.31 శాతం పెరిగితే.. బెంగళూరులో 3.06 శాతం పెరిగినట్లు లాన్సెట్ వెల్లడించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE