భార‌త దిగ్గ‌జాలను అధిగమించిన.. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ

Virat Kohli Breaks Indian Legends Sachin Ganguly and Dravid Records,Virat Kohli Breaks Indian Legends Sachin, Ganguly and Dravid Records,Virat Kohli Breaks Indian Legends Sachin ,Virat Kohli breaks Sachin Tendulkar's record,Virat Kohli breaks Sachin Tendulkar's record for massive Indian feat,SA vs IND, 1st ODI, Kohli breaks Sachin's record,SA vs IND 1st OD,Virat Kohli breaks two records of Indian cricket, Virat Kohli,mango news

సౌతాఫ్రికాతో జ‌రిగిన మొదటి వ‌న్డేలో టీమిండియా ఓడిన‌ప్ప‌టికీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం రికార్డుల మోత మోగించాడు. ఈ ఒక్క మ్యాచ్‌తో ముగ్గురు భార‌త దిగ్గ‌జాల రికార్డుల‌ను విరాట్ కోహ్లీ బ‌ద్ద‌లు కొట్టాడు. ఒకప్పుడు భార‌త జ‌ట్టులో తిరుగులేని ఆట‌గాళ్లుగా రాణించిన స‌చిన్ టెండూల్క‌ర్, సౌర‌వ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్ రికార్డుల‌ను విరాట్ ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా గ‌డ్డ‌పై అధిగ‌మించాడు.

స‌చిన్ టెండూల్కర్ రికార్డు బ్రేక్‌

సౌతాఫ్రికాతో తొలి వ‌న్డే మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 51 ప‌రుగుల‌తో రాణించాడు. ఈ క్ర‌మంలోనే, మ్యాచ్‌కు ముందు 5057 ప‌రుగుల‌తో ఉన్న విరాట్ కోహ్లీ.. 9 ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోర్ వ‌ద్ద దిగ్గ‌జ బ్యాట్సమన్ స‌చిన్ టెండూల్క‌ర్ రికార్డును మొదటగా విరాట్ కోహ్లీ బ్రేక్ చేశాడు. వ‌న్డే ఫార్మాట్‌లో విదేశాల్లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన భార‌త బ్యాట‌ర్‌గా విరాట్ నిలిచాడు. ఇప్ప‌టివ‌ర‌కు విదేశాల్లో ఎక్కువ ప‌రుగులు చేసిన భార‌త బ్యాట‌ర్ల జాబితాలో 5065 ప‌రుగుల‌తో స‌చిన్ టెండూల్క‌ర్ మొద‌టి స్థానంలో ఉన్నాడు. బుధ‌వారం చేసిన 51 ప‌రుగుల‌తో ప్ర‌స్తుతం విరాట్ కోహ్లీ ఖాతాలో 5108 ప‌రుగులు ఉన్నాయి.

ద్రావిడ్‌, గంగూలీలను అధిగమించి..

తొలి వ‌న్డేలో హాఫ్ సెంచ‌రీ సాధించడం ద్వారా కోహ్లీ.. టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, బీసీసీఐ అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీ రికార్డుల‌ను కూడా దాటేశాడు. వ‌న్డే క్రికెట్‌లో సౌతాఫ్రికాపై అత్య‌ధిక ప‌రుగులు చేసిన భార‌త బ్యాట‌ర్ల జాబితాలో గంగూలీ, ద్రావిడ్ రికార్డుల‌ను కోహ్లీ బ్రేక్ చేశాడు. ఇప్ప‌టివ‌ర‌కు సఫారీలపై సౌర‌వ్ గంగూలీ 1313 పరుగులు చేయగా, ద్రావిడ్ 1309 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌కు ముందే విరాట్ 1287 ర‌న్స్ సాధించి ఉండ‌గా తొలి వ‌న్డేలో 51 ప‌రుగులు చేయ‌డం ద్వారా 1338 ప‌రుగులతో గంగూలీ, ద్రావిడ్‌ను అధిగ‌మించాడు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − 7 =