68వ జాతీయ చలనచిత్ర అవార్డులను శుక్రవారం నాడు ఢిల్లీలో కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వశాఖ ప్రకటించింది. ముందుగా జ్యూరీ సభ్యులు విజేతల జాబితాను కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కు అందజేశారు. ఈ ప్రతిష్టాత్మక జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వశాఖ పరిధిలోకి వచ్చే డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ అందిస్తున్నాయి. 2020 సంవత్సరానికి సంబంధించి సినిమాలు మరియు నటులకు ఈ అవార్డులను ప్రకటించారు.
ఈ 68వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాలు మరోసారి సత్తాచాటాయి. ఉత్తమ తెలుగు చిత్రంగా “కలర్ ఫోటో” చిత్రం ఎంపికయింది. అలాగే ప్రముఖ నృత్యకారిణి సంధ్యారాజు నటిస్తూ స్వయంగా నిర్మించగా నృత్య నేపథ్యంలో తెరకెక్కిన ‘నాట్యం’ చిత్రం రెండు జాతీయ అవార్డులను కైవసం చేసుకుంది. ఉత్తమ కొరియోగ్రపీ విభాగంలో సంధ్యారాజు (నాట్యం), ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ విభాగంలో టీవీ రాంబాబు (నాట్యం) ఈ అవార్డులను దక్కించుకున్నారు. ఇక ఉత్తమ మ్యూజిక్ డైరెక్షన్ విభాగంలో ఎస్ తమన్ (అల వైకుంఠపురంలో – సాంగ్స్) జాతీయ అవార్డు దక్కించుకున్నారు. మరోవైపు ఉత్తమ నటుడుగా సూర్య (సూరరై పోట్రు), అజయ్ దేవగణ్ (తానాజీ), ఉత్తమ నటిగా అపర్ణ బాలమురళి (సూరరై పోట్రు) జాతీయ అవార్డులను గెలుచుకోగా, జాతీయ ఉత్తమ చిత్రంగా సూరరై పోట్రు ఎంపికైంది.
అవార్డు విజేతల జాబితా:
- ఉత్తమ చిత్రం: సూరరై పోట్రు (తమిళ్)
- ఉత్తమ చిత్రం(హిందీ): తులసీదాస్ జూనియర్
- ఉత్తమ చిత్రం(తెలుగు): కలర్ ఫోటో
- ఉత్తమ కొరియోగ్రపీ: సంధ్యారాజు (నాట్యం)
- ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్: టీవీ రాంబాబు (నాట్యం)
- ఉత్తమ మ్యూజిక్ డైరెక్షన్: ఎస్ తమన్ (అల వైకుంఠపురంలో – సాంగ్స్), జి వి ప్రకాష్ కుమార్ (సూరరై పోట్రు- బ్యాక్ గ్రౌండ్ స్కోర్)
- ఉత్తమ నటుడు: సూర్య (సూరరై పోట్రు), అజయ్ దేవగణ్ (తానాజీ)
- ఉత్తమ నటి: అపర్ణ బాలమురళి (సూరరై పోట్రు)
- ఉత్తమ సహాయ నటుడు: బిజూ మీనన్ (ఎకె అయ్యప్పనుమ్ కోషియుమ్)
- ఉత్తమ సహాయ నటి: లక్ష్మీ ప్రియా చంద్రమౌళి (శివరంజనియుమ్ ఇన్నుంసిల పెంగల్లుమ్)
- ఉత్తమ దర్శకుడు: సచ్చిదానందన్ కేఆర్ (ఎకె అయ్యప్పనుమ్ కోషియుమ్)
- ఉత్తమ ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్ (శివరంజనియుమ్ ఇన్నుంసిల పెంగల్లుమ్)
- ఉత్తమ వినోదాత్మక చిత్రం: తానాజీ (హిందీ)
- ఉత్తమ సామాజిక చిత్రం: పునరల్ (మరాఠి)
- ఉత్తమ పర్యావరణ పరిరక్షణ నేపధ్య చిత్రం : తాలెందండ (కన్నడ)
- ఉత్తమ పరిచయ దర్శకుడు (ఇందిరా గాంధీ అవార్డు): మడోన్ అశ్విన్ (మండేలా)
- ఉత్తమ సినిమాటోగ్రఫీ: అవిజాట్రిక్ (బెంగాలీ) – సుప్రతిమ్ భోల్
- ఉత్తమ ఆడియోగ్రఫీ: డోళ్లు (కన్నడ), మి వసంతరావు (మరాఠీ), మాలిక్ (మలయాళం)
- ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్: నచికేత్ బార్వే అండ్ మహేష్ షెర్లా (తానాజీ)
- ఉత్తమ స్క్రీన్ ప్లే: సూరరై పొట్రు (తమిళం) – షాలినీ ఉషా నాయర్ అండ్ సుధా కొంగర
- ఉత్తమ స్క్రీన్ ప్లే (డైలాగులు): మండేలా (తమిళం) – మడోన్ అశ్విన్
- ఉత్తమ యాక్షన్ డైరెక్షన్ : ఎకె అయ్యప్పనుమ్ కోషియుమ్ (మలయాళం) – రాజశేఖర్, మాఫియా శశి, సుప్రీమ్ సుందర్
- ఉత్తమ లిరిక్స్: మనోజ్ ముంతాషిర్ (సైనా -హిందీ)
- ఉత్తమ ప్రొడక్షన్ డిజైనర్ : అనీస్ నాడోడి (కప్పెల – మలయాళం)
- ఉత్తమ గాయకుడు: రాహుల్ దేశ్‌పాండే – మి వసంతరావు (మరాఠీ),
- ఉత్తమ గాయని: నాంచమ్మ –ఎకె అయ్యప్పనుమ్ కోషియుమ్ (మలయాళం)
- ఉత్తమ బాల నటులు: అనిష్ మంగేష్ గోసావి (తక్-తక్ – మరాఠీ), ఆకాంక్ష పింగిల్, దివ్యేష్ ఇందుల్కర్ (సుమీ-మరాఠీ)
- ఉత్తమ చిత్రం(తమిళ్): శివరంజనియుమ్ ఇన్నుంసిల పెంగల్లుమ్
- ఉత్తమ చిత్రం(మలయాళం): తింకలాశ్చ నిశ్చయమ్
- ఉత్తమ చిత్రం(కన్నడ): డోళ్లు
- ఉత్తమ చిత్రం(మరాఠీ): గోష్ట ఏక పైథానిచి
- ఉత్తమ చిత్రం(బెంగాలీ): అవిజాట్రిక్
- ఉత్తమ చిత్రం(అస్సామీఎస్): బ్రిడ్జ్
- మోస్ట్ ఫిల్మ్ ఫ్రెండ్లీ స్టేట్: మధ్యప్రదేశ్
- సినిమాపై ఉత్తమ పుస్తకానికి అవార్డు: ది లాంగెస్ట్ కిస్ (ఇంగ్లీష్).
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY