భారత్ లో మారో మంకీ పాక్స్ కేసు..

A Case Of Monkey Pox In India | Mango News

ప్రపంచదేశాల్లో కోరలు చాస్తున్న మంకీపాక్స్ భారత్‌లోనూ విజృంభిస్తోంది. దేశంలో సోమవారం మూడో మంకీపాక్స్ కేసు నమోదు అయింది. దుబాయ్ నుంచి కేరళకు వచ్చిన వ్యక్తికి ఎంపాక్స్ లక్షణాలున్నట్లు అధికారులు గుర్తించారు. అనుమానంతో టెస్టులు చేయగా పాజిటివ్ వచ్చింది. అతనికి మంకీపాక్స్ గ్రేడ్-1 బి వైరస్ నిర్ధారణ అయింది. భారత్‌లో సెప్టెంబర్‌ 9న తొలి కేసు, సెప్టెంబర్‌ 18న రెండు, సెప్టెంబర్ 23న మూడో కేసు నమోదైంది.

కేసులు పెరుగుతున్న దృష్ట్యా కేంద్ర వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. మరో మంకీపాక్స్‌ కేసు నమోదు కావడంతో కట్టడి చర్యలను మరింత ముమ్మరం చేయాలని భావిస్తున్నారు అధికారులు. విదేశాల నుంచి వచ్చే వారిలో ఎవరికైనా మంకీపాక్స్‌ లక్షణాలు కనబడితే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని కోరింది. త్వరగా చికిత్స పొందాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. లక్షణాలు కనిపిస్తే బాధితులు ముందుగానే కుటుంబానికి సోకకుండా ఐసోలేట్‌ అవ్వాలని సూచిస్తున్నారు.

మంకీపాక్స్ లక్షణాలు

మంకీపాక్స్ సోకిన వారు వెంటనే దానిని గుర్తించి ఐసొలేట్ అవడం ముఖ్యం.. ఇన్‌ఫెక్షన్ సాధారణంగా 2-4 వారాల పాటు ఉంటుందని, సపోర్టివ్ మేనేజ్‌మెంట్‌తో రోగులు కోలుకుంటున్నారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమావేశంలో వెల్లడైంది. వాపు శోషరస కణుపులు, జ్వరం, చలిగా అనిపించడం, కండరాల నొప్పి, తలనొప్పి మరియు అలసట ఉంటుంది. అలైంగిక సంపర్కం, గాయపడిన వ్యక్తితో ప్రత్యక్ష సంబంధం లేదా సోకిన వ్యక్తి దుస్తులు లేదా బెడ్‌షీట్‌లను ఉపయోగించడం ఈ వ్యాధి సోకే అవకాశం ఉంటుంది.

మంకీ పాక్స్ కి ప్రత్యేకంగా చికిత్స అంటూ ఏమి లేదు.. చాలా సందర్భాలలో దానంతటదే తగ్గుతుంది. కానీ కొందరిలో ఇది తీవ్రంగా ఉంటుది. ఇప్పటి వరకు ఈ వ్యాధికి వ్యాక్సిన్ లేదా సూచించిన మందులు లేవు. రోగికి లక్షణాల ఆధారంగా మాత్రమే చికిత్స చేస్తారు. వైద్యులు యాంటీవైరల్ మందులు ఇవ్వడం ద్వారా వ్యాధిని నియంత్రిస్తారు.