కరోనా వ్యాప్తి: 6 రాష్ట్రాలకు ఉన్నతస్థాయి బృందాలను పంపిన కేంద్రం

Centre Deputes High Level Teams to 6 States, Centre Deputes High Level Teams to 6 States in View of the Increased Number of Covid-19 Cases, Centre deputes high-level team to Odisha, Centre deputes medical teams to 3 Northeast states, Centre deputes multi-disciplinary teams to 6 States, Centre rushes Covid-19 control teams to 6 states, Centre rushes expert teams to 6 states, coronavirus news, Government deputes teams to six states, High Level Teams to 6 States in View of the Increased Number of Covid-19 Cases, Mango News

దేశంలో గత కొన్నిరోజులుగా కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కాగా కొన్ని రాష్ట్రాల్లో నమోదవుతున్న కరోనా కేసుల్లో మళ్ళీ పెరుగుదల కనిపించడంతో కేంద్రం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా కేరళ, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, ఒడిశా, ఛత్తీస్‌ గడ్ మరియు మణిపూర్‌ రాష్ట్రాలకు ఉన్నత స్థాయి కేంద్ర బృందాలను పంపించినట్లు కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ బృందాలు కోవిడ్-19 నిర్వహణ కోసం ఆయా రాష్ట్ర ఆరోగ్య అధికారులతో మాట్లాడి అక్కడ ఎదుర్కొంటున్న సవాళ్లు మరియు సమస్యలపై చర్చించనున్నాయి. అనంతరం అక్కడ కొనసాగుతున్న కార్యకలాపాలను బలోపేతం చేయడం, అడ్డంకులను తొలగించడం కోసం రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరించనున్నాయి.

ఈ రాష్ట్రాలకు పంపిన ఇద్దరు సభ్యుల ఉన్నత స్థాయి బృందాల్లో ఒక వైద్యుడు మరియు ఒక ప్రజారోగ్య నిపుణులు ఉంటారు. ఈ బృందాలు ముఖ్యంగా కరోనా పరీక్షలు, నిఘా మరియు నియంత్రణ కార్యకలాపాలు, నిబంధనల అమలు, ఆసుపత్రుల్లో బెడ్స్ లభ్యత, అంబులెన్సులు, వెంటిలేటర్లు, మెడికల్ ఆక్సిజన్ సహా కరోనా వ్యాక్సినేషన్ పురోగతిని కూడా పర్యవేక్షించి, పరిష్కార చర్యలను కూడా సూచిస్తాయి. అలాగే ఆ నివేదిక వివరాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు కూడా అందించనున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − 5 =