దేశ రాజధాని ఢిల్లీలో పేలుడు కలకలం సృష్టించింది. రోహిణి జిల్లా ప్రశాంత్ విహార్‌లోని సీఆర్పీఎఫ్ పాఠశాల బయట భారీ పేలుడు సంభవించింది. పేలుడు తీవ్రతకు పాఠశాల ప్రహరీ గోడ ధ్వంసమైంది. స్కూల్ యాజమాన్యం వెంటనే పోలీసులు, అగ్నిమాపక శాఖకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు చేరుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని, పేలుడికి కారణాలపై ఆరా తీస్తున్నామని పోలీసులు తెలిపారు.
ఈ పేలుడుతో పాఠశాలలోని ఎవరికి ఏం జరగలేదు. పేలుడు కారణంగా పాఠశాల గోడ కాస్త ధ్వంసం అయింది. అలాగే స్కూల్ ముందు నిలిపి ఉన్న ఓ కారుతో పాటు సమీపంలో ఉన్న ఓ షాపు ధ్వంసమైనట్టు పేర్కొన్నారు. వెంటనే సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. సమీపంలోని దుకాణం అద్దాలు, దుకాణం సమీపంలో పార్క్ చేసిన కారు ధ్వంసమయ్యాయి. ఎవరికీ గాయాలు కాలేదు.
పేలుడకు కారణం ఏంటో తెలుసుకోడానికి నిపుణులతో దర్యాప్తు చేపట్టామని చెప్పారు సీనియర్ పోలీస్ అధికారి అమిత్ గోయల్. సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు.అయితే, ఇప్పటి వరకూ అక్కడ ఎటువంటి అనుమానిత వస్తువులు లభ్యం కాలేదని పోలీసులు వెల్లడించారు. విచారణలో భాగంగా భూగర్భ మురుగునీటి వ్యవస్థను పరిశీలిస్తున్నట్టు వివరించారు. బాంబు స్క్యేడ్, ఫోరెన్సిక్ నిపుణులు కూడా ఘటనా స్థలికి చేరుకుని, ఆ ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. కాగా ఢిల్లీలో ఇప్పటికే వాయు కాలుష్యం పెరిగిపోయింది. తాజా పేలుడుతో ఆ ప్రాంతంలో గాలి మరింతగా కాలుష్యం అయి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.