
భారత దేశ సివిల్ సర్వీస్ చరిత్రలోనే తొలిసారి కీలక పరిణామం చోటు చేసుకుంది. ఓ సీనియర్ ఐఆర్‌ఎస్ (సివిల్ సర్వీస్ ఉద్యోగి )తన పేరుతో పాటు జెండర్‌ను మార్చుకోవడానికి కేంద్ర ఆర్ధిక శాఖ అనుమతివ్వడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పేరు,జెండర్ విషయంలో కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ..ఇప్పుడు అన్ని రికార్డ్స్‌లలో ఆ ఉద్యోగి పేరు, జెండర్ ఇతర వివరాలు మారిపోనున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా సీఈఎస్‌టీఏటీ అంటే.. కస్టమ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యూనల్ విభాగంలో 35ఏళ్ల అనసూయ సీనియర్ జాయింట్ కమిషనర్‌గా ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు.
అయితే కొద్ది నెలల క్రితం తన పేరును అనసూయకు బదులు తన పేరును ఎం.అనుకతిర్ సూర్యగా, జెండర్‌ను కూడా మార్చాలని కేంద్రానికి అభ్యర్ధించారు. దీనికి కేంద్రం సానుకూలంగా స్పందించింది. అనుసూర్య పేరును ఎం.అనుకతిర్ సూర్యగా మార్చడంతో పాటు జెండర్ కూడా మార్చడానికి అంగీకరిస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.
చెన్నైలో అసిస్టెంట్ కమిషనర్‌గా
అనుకతిర్ సూర్య లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం.. సూర్య 2013 డిసెంబర్‌లో చెన్నైలో అసిస్టెంట్ కమిషనర్‌గా తన జాబులో జాయిన్ చేశారు. 2018లో డిప్యూటీ కమిషనర్‌గా పదోన్నతి పొంది.. ఆ తర్వాత గతేడాది హైదరాబాద్‌కు ట్రాన్స్‌ఫర్ అయ్యారు.
అనుకతిర్ సూర్య చెన్నైలోని మద్రాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి.. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్‌లో బ్యాచిలర్ డిగ్రీని, 2023లో భోపాల్‌లోని నేషనల్ లా ఇన్‌స్టిట్యూట్ యూనివర్సిటీ నుంచి సైబర్ లా అండ్ సైబర్ ఫోరెన్సిక్స్‌లో పీజీ డిప్లొమా పూర్తి చేశారు. అయితే ఇప్పుడు అనసూయ కాస్తా అనుకతిర్ సూర్యగా మారడం కామనే అయినా జెండర్ కూడా మార్చడం ఇప్పుడు ఇండియన్ సివిల్ సర్వీస్ హిస్టరీలో ఆసక్తికరంగా మారింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE