కొవాగ్జిన్‌ కరోనా వ్యాక్సిన్ పై భారత్ బయోటెక్ కీలక సూచనలు

Bharat Biotech COVAXIN, Bharat Biotech Covaxin Vaccine, Bharat Biotech Issues Fact Sheet Over Use Of COVAXIN, Coronavirus COVAXIN, Coronavirus Vaccine COVAXIN, Coronavirus Vaccine COVAXIN News, COVAXIN Clinical Trial, COVAXIN COVID-19 Vaccine Approval, COVAXIN Phase III Trials, Covaxin Vaccine, Covid-19 Vaccination Drive, Fact Sheet Over Use Of COVAXIN, Mango News

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణి విజయవంతగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలో అత్యవసర వినియోగానికై డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఆమోదం పొందిన తమ కొవాగ్జిన్‌ కరోనా వ్యాక్సిన్ కు సంబంధించి భారత్ బయోటెక్ సంస్థ ఫాక్ట్ షీట్ ను విడుదల చేసింది. కొవాగ్జిన్‌ వ్యాక్సిన్ ఎవరూ తీసుకోవాలి, ఎవ‌రు తీసుకోకూడదు అనే విషయాలపై ఈ ఫాక్ట్ షీట్ లో భారత్ బయోటెక్ క్లారిటీ ఇచ్చింది. ముఖ్యంగా అల‌ర్జీతో బాధపడుతున్న వారు, జ్వరం ఉన్నవారు, బ్లీడింగ్ డిజార్డ్‌ లేదా బ్లడ్‌ థిన్నర్స్ వాడేవారు, బ‌ల‌హీన‌మైన రోగ నిరోధక శక్తి ఉన్నవారు లేదా రోగ‌ నిరోధ‌కవ్య‌వ‌స్థ‌పై ప్ర‌భావం చూపే మందులు వాడేవారు, గ‌ర్భిణులు, పాలిచ్చే త‌ల్లులు, వేరే సంస్థ యొక్క కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారు, అలాగే వ్యాక్సినేషన్ సమయంలో ఏదైనా తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు వాక్సినేటర్/పర్యవేక్షణ అధికారి గుర్తిస్తే వారు కొవాగ్జిన్‌ వ్యాక్సిన్ తీసుకోవద్దని ఫాక్ట్ షీట్ లో భారత్ బయోటెక్ స్పష్టం చేసింది.

కోవాగ్జిన్ వ్యాక్సిన్ వలన వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి కూడా భార‌త్ బ‌యోటెక్ వెల్ల‌డించింది. వ్యాక్సిన్ తీసుకున్న ప్రాంతంలో నొప్పి, వాపు, ఎర్రగా అవ్వడం, దుర‌ద, చేతిపైన గట్టిపడడం, వ్యాక్సిన్ తీసుకున్న చేయి బలహీనంగా ఉండడం, ఒ‌ళ్లు నొప్పులు, త‌ల‌నొప్పి, జ్వ‌రం, బ‌ల‌హీన‌త‌, ద‌ద్దులు, న‌ల‌త‌, వాంతులు వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. కోవాగ్జిన్ వలన అల‌ర్జీ రియాక్ష‌న్ కూడా వచ్చే అవకాశం ఉందని, అయితే తీవ్రంగా వచ్చే అవకాశం చాలా అరుదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ తీసుకున్నాక అర‌గంట పాటు వ్యాక్సినేషన్ సెంట‌ర్‌లోనే పర్యవేక్షణలో ఉండాల‌ని పేర్కొన్నారు. మరోవైపు కోవాగ్జిన్ వ్యాక్సిన్ తీసుకున్న వారికీ సంబంధించి రెండ‌వ డోసు తీసుకున్న త‌ర్వాత‌ మూడు నెల‌ల పాటుగా వారు ఫాలో అప్ చేయబడతారని భార‌త్ బ‌యోటెక్ వెల్ల‌డించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − five =