మెట్రోరైల్ ఫేజ్-2 కారిడార్ డీపీఆర్ ఆమోదం, నిధుల కేటాయింపుకై కేంద్రమంత్రికి మంత్రి కేటీఆర్ లేఖ

Minister KTR Writes Letter to Union Minister Hardeep Singh Puri over Metro Rail Phase-2 Funds Allocation,Metro Rail Phase-2,Metro Rail Phase-2 Funds Allocation,Union Minister Hardeep Singh Puri,Minister KTR Writes Letter,Minister KTR On Metro,Mango News,Mango News Telugu,Minister KTR ,Minister Hardeep Singh Puri,Metro Rail,Hyderabad Metro Rail,Hyderabad Metro,KTR Seeks Centre Approval For Phase-2 ,Hyderabad Metro On Twitter

దేశంలో వేగంగా అభివృద్ది చెందుతున్న మెట్రో పాలిటన్ నగరాల్లో ఒకటైన హైద్రాబాద్ నగరంలోని మెట్రో రైల్ ప్రాజెక్టు సెకండ్ ఫేజ్ కారిడార్ పనులను చేపట్టుటకు ఆమోదంతో పాటు బడ్జెట్ ప్రతిపాదనలు చేయాలని కోరుతూ కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరికి రాసిన లేఖలో రాష్ట్ర మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రి కేటీఆర్ కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రికి రాసిన లేఖలో మెట్రోరైల్ కారిడార్-2 ఆవశ్యకత గురించి వివరించారు.. చాలా వేగంగా పెరుగుతున్న నగర ప్రజల అవసరాలకనుగుణంగా కారిడార్-2 కింద మెట్రో రైల్ విస్తరణ జరగాలని తెలిపారు. ఇప్పటికే మొదటి దశ కింద నడుస్తున్న మెట్రో రైల్ ప్రాజెక్టు నగరానికే కలికితురాయిగా నిలిచిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మెట్రో రైల్ ఫస్ట్ ఫేజ్ లో 69 కిలోమీటర్ల నిడివిలో అందుబాటులోకి వచ్చి నగర రవాణా వ్యవస్థకు అండగా నిలుస్తున్నదని కేటీఆర్ ఆ లేఖలో వివరించారు.

వీజీఎఫ్ స్కీమ్ (వయబుల్ గ్యాప్ ఫండింగ్ ) పీపీపీ మోడ్ లో అమలు చేసిన హైదరాబాద్ రైల్ లైన్ ఫేజ్-1 ప్రాజెక్ట్ ప్రపంచంలో పెద్ద మెట్రో ప్రాజెక్ట్ గా గుర్తింపు పొందింధని తెలిపారు. ఈ నేపథ్యంలో రెండవ విడత 31 కిలోమీటర్ల నిడివిలో మెట్రోరైల్ ప్రాజెక్టు– 2 కారిడార్ పనులకై ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. 1) బీహెచ్ఈఎల్ నుంచి లక్డీకాపూల్ వరకు 26 కిలో మీటర్ల నిడివిలో 23 స్టేషన్లతో కనెక్ట్ చేసే ప్రతిపాదన, 2) నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు 5 కిలోమీటర్ల నిడివిలో 4 స్టేషన్లను కనెక్ట్ చేసే ప్రతిపాదన తో కూడిన డిటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ ను తయారు చేసినట్లు మంత్రి తన లేఖలో పేర్కొన్నారు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో చేపట్టుటకు గాను రూ.8453 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు లేఖలో వివరించారు. ఈ డీపీఆర్ తో పాటు అందుకు సంబందించిన అన్ని డాకుమెంట్స్ ను రాష్ట్ర పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ద్వారా అక్టోబర్ 22న కేంద్ర ప్రభుత్వానికి పంపినట్లు మంత్రి తెలిపారు. అదేవిధంగా సెకండ్ ఫేజ్ కు సంబందించిన ప్రతిపాదనల వివరాలు చర్చించడానికి కేంద్రమంత్రి అపాయింట్ మెంట్ ను మంత్రి కేటీఆర్ కోరారు. ముందస్తు సమాచారం కొరకు లేఖ ద్వారా వివరాలు తెలియజేస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఎక్స్ టర్నల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ తో అమలయ్యే ఈ ప్రాజెక్టుకు పాలనాపరమైన, సూత్రప్రాయ అనుమతులు ఇవ్వాలని కోరారు. అలాగే హైదరాబాద్ మెట్రోరైల్ ప్రాజెక్టు–2 కారిడార్ ప్రతిపాదనలను 2022-23 బడ్జెట్ లో పేర్కొనాలని మంత్రి కేటీఆర్ కోరారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × five =