
యావత్ దేశ ప్రజల చిరకాల స్వప్నమైన అయోధ్య రామాలయ ప్రారంభోత్సవ ఘట్టం ఎట్టకేలకు అత్యంత వైభవంగా ముగిసింది . గర్భగుడిలో బాల రాముడు కొలువుదీరిన అపురూపమైన క్షణాలను యావత్ దేశం కళ్లారా వీక్షించింది.జనవరి 22న ఆహ్వానించిన ప్రముఖుకులు మాత్రమే సోమవారం రామయ్యను దర్శించుకోగా.. జనవరి 23 నుంచి సామాన్య భక్తులు కూడా బాలరాముని దర్శించుకుంటున్నారు.
అయోధ్య రామయ్యను ప్రత్యక్షంగా వీక్షించడానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రామభక్తులు అయోధ్యకు క్యూ కట్టడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. ఇలా రోజుకు లక్ష నుంచి 1.5లక్షల మంది ఈ చారిత్రక అయోధ్య నగరాన్ని సందర్శించే అవకాశం ఉందని..ఇంటర్నేషనల్ బ్రోకరేజీ సంస్థ జెఫరీస్ గ్రూప్ అంచనా వేస్తోంది. దీంతో దేశ టూరిజం ముఖ చిత్రమే మారనుందని అభిప్రాయపడుతోంది.
దేశంలో ఇకపై కొత్త పర్యాటక కేంద్రంగా అయోధ్య మారనుందని నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ కంపెనీలు భావిస్తున్నాయి. రామమందిర ప్రారంభోత్సవం తర్వాత ఏడాదికి 5 కోట్ల మంది భక్తులు సందర్శించే అవకాశం ఉందని జెఫరీస్ రిపోర్ట్ అంచనా వేసింది. అయోధ్యలో కొత్తగా నిర్మించిన ఎయిర్‌పోర్టు, రీ స్టోర్ చేసిన రైల్వేస్టేషన్, రోడ్డు ట్రాన్స్‌ఫోర్ట్ సిస్టమ్‌ను డెవలప్ చేయడంతో పాటు కొత్త హోటళ్లు, ఇతర ఎకనమిక్ యాక్టివిటీస్ భారీగా పెరగనున్నట్లు తెలిపింది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ తో టూరిజం మరింత పుంజుకోనుందని పేర్కొంది.
అయోధ్యలోని రామాలయాన్ని నిర్మిస్తూనే.. ఇదే సమయంలో అక్కడి ఎయిర్‌పోర్టు, రైల్వే స్టేషన్, రోడ్డు రవాణా వ్యవస్థను కూడా మెరుగుపరుస్తున్నారు. దీంతో యాత్రికుల పెరుగుదలతో పాటు ఆర్థికంగానూ చాలా రంగాలు లాభపడతాయి. ముఖ్యంగా హోటళ్లు,ఏవియేషన్, హాస్పిటాలిటీ, జర్నీ రిలేటడ్, సిమెంటు రంగాలు ప్రయోజనం పొందనున్నాయి. దీంతో అయోధ్య దేశ పర్యాటక రంగానికి కొత్త మోడల్‌గా మారనుందని జెఫరీస్ వెల్లడించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE