ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండకపోతే భారీ మూల్యం

In The Future Corona Like Mahammars, In The Future, Corona Like Mahammars, Future Mahammars, WHO, Coronavirus, Pandemic Accord, In the future, Corona, Latest Corona News, Corona News Updte, Covid, India, China, Mango News, Mango News Telugu
WHO ,Coronavirus,Pandemic Accord,In the future, Corona,

కరోనా మహమ్మారి నుంచి ప్రపంచం మొత్తం కోలుకున్నా కూడా.. భవిష్యత్తులో ఇటువంటి మహమ్మారుల ప్రమాదం మరిన్ని పొంచి ఉన్నట్లు డబ్ల్యూహెచ్‌వో ఇప్పటికే హెచ్చరించింది. అటువంటి ప్రమాదాలు సంభవిస్తే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ  ఇప్పటికే సూచించింది. కానీ భవిష్యత్తు మహమ్మారులపై సంసిద్ధతకు సంబంధించిన అగ్రిమెంట్ కుదుర్చుకోవడంలో.. ప్రపంచ దేశాల నిర్లక్ష్యం వహిస్తున్నాయంటూ డబ్ల్యూహెచ్‌వో ఆందోళన వ్యక్తం చేసింది. దీనివల్ల భవిష్యత్తు తరాలు మనల్ని క్షమించకపోవచ్చని హెచ్చరిస్తోంది.

ప్రపంచ దేశాలు కమిట్మెంట్‌తో వ్యవహరించడం లేదని ఆందోళన చెందుతున్నామని డబ్ల్యూహెచ్‌వో చెప్పుకొచ్చింది . సమయం తక్కువ ఉందని.. పరిష్కరించుకోవాల్సిన సమస్యలు మాత్రంమ చాలా ఉన్నాయని చెప్పింది. ఈ ఒప్పందం చేసుకోవడంలో ఫెయిలయితే ఒక అవకాశాన్ని కోల్పోయినట్లేనని.. భవిష్యత్తు తరాలు మనల్ని క్షమించకపోవచ్చని తెలిపింది. ఒప్పందానికి ధైర్యం కావాలనని.. రాజీ పడాలని.. దీనిపై ఏకాభిప్రాయం సాధించడానికి అన్ని సభ్యదేశాలు కూడా తమ ప్రయత్నాలు ముమ్మరం చేయాలని డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ అన్నారు. ఈ ఏడాది మే నాటికి మహమ్మారి ఒప్పందానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించుకోవడానికి ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో ప్రపంచ నేతలు అంగీకరించిన విషయాన్ని ఆయన  గుర్తు చేశారు.

ఫ్యూచర్లో మహమ్మారులను నిర్మూలించడంపైన సంసిద్ధంగా ఉండటం పైన, ఒకవేళ సంభవిస్తే త్వరగా ప్రతిస్పందించడంపైన గతంలో ఒక చర్చ జరిగింది. దీనిపై ఇంటర్నేషనల్ స్థాయిలో ఓ ఒప్పందాన్ని చేసుకోవాలని డిసెంబర్‌ 2021న డబ్ల్యూహెచ్‌వో సభ్య దేశాలు నిర్ణయం తీసుకున్నాయి. దీనిపై ఈ ఏడాది మే 27న నిర్వహించనున్న వరల్డ్‌ హెల్త్‌ అసెంబ్లీ వార్షిక సమావేశంలోగా ఇది పూర్తి చేయడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇదే అంశంపై ఇప్పుడు స్పందించిన టెడ్రోస్‌.. దీనిపై ఎవ్వరూ ముందుకు రాకపోతే..మొత్తం ప్రాజెక్టు మూలనపడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × two =