రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. 2024 జులైలో ముంబైలో జరిగిన ఈ వేడుక దేశ విదేశాల వ్యాపారవేత్తలు, రాజకీయ ప్రముఖులు, సినీ తారలు, క్రికెటర్లు సహా దాదాపు 2500 మంది ప్రముఖులతో హైలైట్‌గా నిలిచింది. పెళ్లి మూడు రోజుల పాటు జరిగింది. -ఈ వివాహం కోసం అంబానీ కుటుంబం దాదాపు రూ. 5000 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. ఇది వారి మొత్తం ఆస్తిలో 0.05 శాతం మాత్రమే. వేడుకలు అట్టహాసంగా సాగడంతో పాటు, వివాహానికి సంబంధించిన దుస్తులు, ఆభరణాలు, అలంకరణలు నెట్టింట వైరల్ అయ్యాయి.
పెళ్లి తర్వాత నాలుగు నెలలకు రాధికా మర్చంట్ తన ఇంటి పేరును “మర్చంట్” నుంచి “అంబానీ”గా అధికారికంగా మార్చుకున్నారు. ఈ నిర్ణయంతో ఆమె అంబానీ కుటుంబంలో పూర్తిగా కలిసిపోయారు. సాంప్రదాయానికి అనుగుణంగా ఈ మార్పు చర్చనీయాంశంగా మారింది. వీరెన్ మర్చంట్ కుమార్తె రాధికా, ఎన్‌కోర్ హెల్త్‌కేర్ డొమెస్టిక్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. తన భవిష్యత్తు వ్యాపార లక్ష్యాలు పంచుకుంటూ, దేశవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ రంగాన్ని విస్తరించడంపై దృష్టి సారించినట్లు ఆమె పేర్కొన్నారు.
అంబానీ ఇంటి వివాహం బాలీవుడ్ సెలబ్రిటీలు, తెలుగు చిత్ర పరిశ్రమ హీరోలు, టీమిండియా క్రికెటర్ల హాజరుతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వివాహానికి ముందు, వివాహం అయిపోయేంత వరకు జరిగిన ప్రతి కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ పెళ్లి ముకేశ్ అంబానీ కుటుంబ సంప్రదాయాలకు, స్థాయికి నిలువుటద్దంగా నిలిచింది. రాధికా మర్చంట్, ఇప్పుడు రాధికా అంబానీ, తన కొత్త భూమికతో వ్యక్తిగత జీవితంలోను, వ్యాపారంలోను ముందుకు సాగుతున్నారు.