ఆస్ట్రేలియా పురుషుల క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గా ఆండ్రూ మెక్‌డొనాల్డ్ నియమితులయ్యారు. ఈ మేరకు క్రికెట్ ఆస్ట్రేలియా ఒక ప్రకటన చేసింది. గత కొంతకాలంగా జట్టుకు కేర్‌టేకర్‌గా విజయవంతమవడమే కాకుండా, పాకిస్థాన్‌లో చారిత్రాత్మక టెస్ట్ సిరీస్ విజయానికి ఆండ్రూ మెక్‌డొనాల్డ్ నాయకత్వం వహించాడని క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది. గత ఫిబ్రవరిలో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు హెడ్ కోచ్ పదవికీ జస్టిన్ లాంగర్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. హెడ్ కోచ్ గా జూన్ వరకు కొనసాగాల్సి ఉన్నప్పటికీ ఒప్పందం విషయంలో ఏర్పడ్డ విభేదాల అనంతరం కోచ్ పదవికి రాజీనామా చేస్తునట్టు జస్టిన్ లాంగర్ ప్రకటించాడు. ఈ నేపథ్యంలో రెండు నెలల అనంతరం తాత్కాలిక కోచ్‌గా ఉన్న ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌ను హెడ్ కోచ్ గా నియమిస్తూ క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయం తీసుకుంది.
2019 నుండి ఆస్ట్రేలియా జట్టుకు అసిస్టెంట్‌గా ఉన్న మెక్‌డొనాల్డ్‌ను నాలుగేళ్ల ఒప్పందంపై హెడ్ కోచ్ గా నియమించారు. ఆస్ట్రేలియా టెస్ట్, వన్డే మరియు టీ20 జట్లను మెక్‌డొనాల్డ్ పర్యవేక్షించనున్నాడు. శ్రీలంక, భారత్ తో టెస్ట్ సిరీస్ లు మరియు సొంత గడ్డపై టీ20 ప్రపంచ కప్ ముందు మెక్‌డొనాల్డ్ ఆస్ట్రేలియా హెడ్ కోచ్ బాధ్యతలు స్వీకరించేందుకు మెక్‌డొనాల్డ్ సిద్దమయ్యాడు. ఇప్పటి వరకు ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా సాగిందని, రాబోయే ఉత్తేజకరమైన కాలానికి ఈ అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినందుకు గౌరవంగా భావిస్తున్నానని, క్రికెట్ ఆస్ట్రేలియాకు ధన్యవాదాలు అని మెక్‌డొనాల్డ్ పేర్కొన్నారు. నాయకత్వ సమూహం, ఆటగాళ్లు మరియు సిబ్బందిని ఉత్తేజపరిచే స్వల్పకాలిక సవాళ్లు చాలా ఉన్నాయని, అయితే ప్రణాళికతో ముందుకువెళ్లేందుకు ఎదురుచూస్తున్నానని ఆండ్రూ మెక్‌డొనాల్డ్ తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ