12 ఏళ్లకు ఒకసారి భారతదేశంలో గంగా, గోదావరి, ప్రాణహిత, తుంగభద్ర, కావేరీతోపాటు అనేక నదులకు పుష్కరాలను నిర్వహిస్తారు. అలా ఇప్పుడు మరో 10 రోజుల్లో గంగా నది పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. ఈ మహా కుంభమేళా జనవరి 13న ప్రారంభం అయి ఫిబ్రవరి 26న ముగుస్తాయి. ప్రయాగ్‌రాజ్‌లో జరిగే ఈ మహాకుభమేళాకు ఉత్తరప్రదేశ్‌లోని యోగీ సర్కార్ ఇప్పటికే పటిష్ట ఏర్పాట్లు చేసింది. ప్రత్యేకంగా హైఎండ్ టెక్నాలజీ వాడుతూ అడుగడుగునా భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అండర్ వాటర్ డ్రోన్లతో పాటు సీసీకెమెరా నిఘా నేత్రాలతో గమనించే ఏర్పాట్లు చేశారు.
ఈ కుంభమేళాకు సాధువులు, భక్తులు, పర్యాటకులు ..45 కోట్ల మంది హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. కుంభమేళాలలో ఎవరైనా ప్రమాదవశాత్తూ.. నీటిలో మునిపోతే వెంటనే గుర్తించి వారిని కాపాడేలా అండర్ వాటర్ డ్రోన్లను వినియోగిస్తున్నారు. ఇప్పటికే ప్రయాగ్‌రాజ్‌లో పర్యాటకుల వసతి సహా భద్రత కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా మహాకుంభ మేళాను విజయవంతం చేయాలని కోరుతున్నారు.
యూపీలో నిర్వహించే మహా కుంభ మేళాను స్వచ్ఛంగా, ఆరోగ్యంగా, సురక్షిత, డిజిటల్ కార్యక్రమంగా మార్చడానికి యూపీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది.హరిద్వార్, నాసిక్ ఉజ్జయినీ తారాల్లో కుంభమేళాల్లో ఇప్పటికే ఏర్పాట్ల సందడి కనిపిస్తోంది. ఇటు కుంభమేళాలో భద్రత కోసం 50 వేల మందిి పారామిలటరీ బలగాలు మోహరించనున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ తో కూడిన 2,700 కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. పోలీస్ స్టేషన్లలో సైబర్ హెల్ప్ డెస్క్, 56 మంది సైబర్ వారియర్లను కూడా అందుబాటులో ఉంచుతారు.
తాత్కాలిక ఆస్పత్రులతోపాటు శస్త్రచికిత్స, రోగ నిర్ధారణ సౌకర్యాలు అందుబాటులో ఉంచనున్నారు. భక్తులకు సూచనలు చేయడానికి అడుగడుగునా హిందీ, ఇంగ్లిష్‌తోపాటు ప్రాంతీయ భాషల్లో 800 బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేశారు. ఫైర్ యాక్సిడెంట్ నియంత్రణకు నాలుగు ఆర్టిక్యులేటింగ్ వాటర్ టవర్స్ వెహికల్స్ అందుబాటులో ఉంచుతారు.అలాగే కుంభమేళాలో ఇన్ఫర్మేషన్ కోసం భారతీయ భాషల్లో చాట్స్ కోసం ఏఐ ఛానల్స్ కూడా ఏర్పాటు చేయనున్నారు.