జమ్ముకాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు: ఓటర్ల కోసం మోదీ, ఖర్గే ట్వీట్స్

Assembly Elections Begin In Jammu And Kashmir, Assembly Elections, Assembly Elections started In Jammu And Kashmir, Kharge Tweet, Modi Tweet, Voters, Tough Challenge For All Parties, Jammu And Kashmir Elections, Jammu Kashmir, Jammu And Kashmir Assembly Elections, Jammu Kashmir Assembly Polls Live, J&K Assembly Election 2024 Live Updates, NDA, National News, India, Congress, BJP, PM Modi, Live Updates, Breaking News, Live News, Mango News, Mango News Telugu

10 ఏళ్ల తర్వాత జమ్ముకాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమైయ్యాయి. 24 అసెంబ్లీ స్థానాలకు మొదటి దశలో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఏడు జిల్లాల్లో 24 నియోజకవర్గాల్లో 219 మంది అభ్యర్థులు ఇప్పుడు పోటీలో ఉన్నారు. కాశ్మీర్‌లో 16, జమ్మూలో 8 స్థానాల్లో 3, 276 పోలింగ్ స్టేషన్లను ఎన్నికల కమిషన్ అధికారులు ఏర్పాటు చేశారు. 23,27,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఓటింగ్ ప్రక్రియ సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది. మహిళలు, ప్రత్యేక వికలాంగులు, యువత నిర్వహించే ప్రత్యేక పోలింగ్ స్టేషన్లు, పర్యావరణ సమస్యల గురించి మెసేజులను ఫార్వార్డ్ చేయడానికి గ్రీన్ పోలింగ్ స్టేషన్లు, ఇతర ప్రత్యేక పోలింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఎక్స్ వేదికగా స్పందించారు. కేంద్రపాలిత ప్రాంతంలోని పౌరులు పెద్ద సంఖ్యలో ఓటు వేసి ప్రజాస్వామ్య పండుగను జరుపుకోవాలని ఆయన కోరారు. ముఖ్యంగా యువకులు, మొదటిసారి ఓటర్లు, మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని మోదీ పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని.. మీరు వేసే ఓటు ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

అలాగే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జమ్మూ కాశ్మీర్ ప్రజలు తమ హక్కులను కాపాడుకోవడానికి, నిజమైన అభివృద్ధి, పూర్తి రాష్ట్ర హోదా వల్ల కొత్త శకాన్ని ప్రారంభించేందుకు ఆసక్తిగా ఉన్నారని ట్వీట్ చేశారు. 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తొలి దశ పోలింగ్‌ ప్రారంభం కానుండటంతో ప్రతి ఒక్కరూ తమ ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకోవాలని, అధిక సంఖ్యలో ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.

ప్రతి ఒక్క ఓటు భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తిని కలిగి ఉంటుందని ఖర్గే చెప్పుకొచ్చారు. శాంతి, న్యాయం, పురోగతి, ఆర్థిక సాధికారత యొక్క యుగాన్ని తీసుకురావాలన్నారు. ఈ కీలకమైన ఎన్నికలలో పాల్గొని మార్పుపకు ఉత్ప్రేరకాలుగా ఉండవలసిందిగా తాము అందరికి, ముఖ్యంగా మొదటిసారిగా ఓటు వేసిన వారికి విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. మొట్టమొదటిసారిగా ఒక రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా తగ్గించారని గుర్తు చేశారు. మీరు మీ ఓటు వేసినప్పుడు, ఈ అపహాస్యానికి బాధ్యులెవరో గుర్తుంచుకోవాలని ఖర్గే అన్నారు. మనం ఐక్యమై జమ్మూ కాశ్మీర్‌కు ఉజ్వల భవిష్యత్తును రూపొందిద్దామని.. ఇక్కడ పౌరులందరి వాణీలు వినిపిస్తాయని ట్వీట్లో పేర్కొన్నారు.