బీహార్‌లో ఎన్డీఏ కూటమి సునామీ

Bihar Assembly Election 2025 NDA Alliance Sweeps State With Over 200 Seats

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈరోజు (శుక్రవారం) వెలువడుతుండగా, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) కూటమి భారీ విజయం దిశగా దూసుకెళ్తోంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి మ్యాజిక్ ఫిగర్ ను దాటి 200కు పైగా స్థానాల్లో ముందంజలో ఉంది.

ఇకాగా, బీహార్ అసెంబ్లీలో మొత్తం 243 స్థానాలు ఉండగా, మ్యాజిక్ ఫిగర్ (మెజారిటీకి అవసరమైన స్థానాలు) 122గా ఉంది. ది బీహార్ ఎన్నికల చరిత్రలోనే అత్యంత భారీ విజయాల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో NDA (ఎన్డీఏ) కూటమి 200+ స్థానాలతో అధికారం కైవసం చేసుకోనుంది.

ఇక ఆర్‌జేడీ నేత తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని మహాఘట్‌బంధన్ (MGB) కూటమి కేవలం 30+ స్థానాలలో మాత్రమే ప్రభావం చూపించగలుగుతోంది. కనీసం 50 స్థానాల మార్కును కూడా చేరుకోలేక తీవ్ర నిరాశను చవిచూసింది. మరోవైపు ఇతరులు/చిన్న పార్టీలు 5-10 స్థానాల్లో విజయం అందుకోనున్నాయి.

కీలక అంశాలు..

బిగ్ విన్: ఎన్డీఏ కూటమి 200 స్థానాల మార్కును దాటడం ద్వారా స్పష్టమైన సునామీ లాంటి తీర్పును సొంతం చేసుకుంది.

పార్టీల బలం: ఎన్డీఏలో భారతీయ జనతా పార్టీ (BJP) అత్యధిక స్థానాల్లో ముందంజలో ఉంటూ అతిపెద్ద పార్టీగా అవతరించే దిశగా ఉంది. జేడీయూ (JDU) కూడా స్థిరమైన ప్రదర్శన కనబరిచింది.

చిరాగ్ పాశ్వాన్ ప్రభంజనం: లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) నేత చిరాగ్ పాశ్వాన్ అద్భుతమైన పనితీరును కనబరుస్తూ, భారీ సంఖ్యలో సీట్లలో ముందంజలో ఉన్నారు, ఎన్డీఏ విజయానికి ఇది కీలకంగా మారింది.

ఈ ఫలితాల ద్వారా నితీష్ కుమార్ మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడం ఖాయమైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here