స్వీయ నిర్బంధంలోకి వెళ్లిన బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్

Bollywood Super Star Salman Khan, Bollywood Super Star Salman Khan in Self-isolation, Mango News Telugu, Salman Khan, salman khan corona positive news, Salman Khan Coronavirus, salman khan covid test, Salman Khan family under isolation, Salman Khan goes into isolation, Salman Khan in self-isolation, Super Star Salman Khan

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ స్వీయ నిర్బంధం (సెల్ఫ్ ఐసొలేషన్) లోకి వెళ్లినట్టు తెలుస్తుంది. తన కారు డ్రైవర్‌ తో పాటుగా మరో ఇద్దరు వ్యక్తిగత సిబ్బందికి కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో సల్మాన్ ఖాన్ మరియు అతని కుటుంబ సభ్యులు స్వీయ నిర్బంధంలోకి వెళ్లారని, కాగా వారి కరోనా పరీక్షల ఫలితాలు ఇంకా రావాల్సి ఉందని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఈ విషయంపై సల్మాన్ ఖాన్ గాని, వారి కుటుంబ సభ్యులు గాని అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు కరోనా బారిన పడిన సిబ్బందిని ముంబయిలోని ఓ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఇక ప్రస్తుతం సల్మాన్ ఖాన్ స్వీయ నిర్బంధంలో ఉండడంతో ఈ వీకెండ్ బిగ్ బాస్ 14 ఎపిసోడ్ నిర్వహణపై కూడా ప్రభావం పడే అవకాశముంది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ