ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ 2025 ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంటులో 2025 బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇది ఆమె వరుసగా 8వ బడ్జెట్ కావడం గమనార్హం. ఈసారి 6 ప్రధాన అంశాలపై ప్రభుత్వం కీలక ప్రకటనలు చేసే అవకాశముంది. ప్రజలు, వ్యాపారులు, రైతులు, ఉద్యోగస్తులు, స్టార్టప్‌లుఅందరికీ ఇది ప్రాధాన్యత కలిగిన బడ్జెట్ కానుంది.
ఈసారి బడ్జెట్‌లో కీలక మార్పులు ఇవేనా?
పెట్రోల్-డీజిల్ ధరల తగ్గింపు
ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడంతో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉంది. మొబైల్, ఎలక్ట్రానిక్ విడిభాగాల దిగుమతులపై సుంకాన్ని 20% తగ్గించనున్నారు. అయితే, బంగారం, వెండి దిగుమతులపై డ్యూటీ పెరిగే ఛాన్స్ ఉంది, దీని వల్ల బంగారం ధర పెరిగే అవకాశం ఉంది.
ఆదాయపు పన్ను స్లాబ్‌లలో మార్పులు
కొత్త ట్యాక్స్ విధానంలో రూ.10 లక్షల వరకు ఆదాయంపై పన్ను మినహాయింపు.
రూ.15 లక్షల పైబడి రూ.20 లక్షల వరకు 25% పన్ను బ్రాకెట్ ప్రవేశపెట్టే అవకాశం.
కనిష్ట పన్ను మినహాయింపు పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచే అవకాశం.
రైతులు, పింఛనుదారులకు మరిన్ని ప్రయోజనాలు
పీఎం కిసాన్ పథకం: రైతులకు సంవత్సరానికి రూ.6,000 బదులుగా రూ.12,000 అందించే అవకాశాలు.
ఆయుష్మాన్ భారత్: 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు మెరుగైన ఆరోగ్య సేవలు.
అటల్ పెన్షన్ యోజన: నెలకు గరిష్టంగా రూ.5,000 స్థానంలో రూ.10,000 పెన్షన్ అవకాశం.
యువతకు ఉద్యోగ అవకాశాలు
ఇంటెగ్రేటెడ్ నేషనల్ ఎంప్లాయ్మెంట్ పాలసీ అమలు.
ప్రభుత్వ కార్యాలయాల్లో గ్రాడ్యుయేట్‌లకు ఇంటర్న్‌షిప్ అవకాశాలు.
అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాల కోసం కొత్త అథారిటీ ఏర్పాటు.
స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు ప్రత్యేక నిధులు కేటాయించే అవకాశం.
ఆరోగ్య రంగానికి మరిన్ని నిధులు
దేశ ఆరోగ్య బడ్జెట్‌ను 10% పెంచే అవకాశం.
MRI, ఇతర మెడికల్ పరికరాల దిగుమతిపై 7.5% సుంకం తగ్గింపు.
మెడికల్ కాలేజీల్లో 75,000 కొత్త మెడికల్ సీట్లు అందుబాటులోకి తేవడానికి ప్రణాళిక.
ఇళ్ల కొనుగోలుదారులకు శుభవార్త
మెట్రో నగరాల్లో చౌక ఇళ్ల ఖరీదు పరిమితిని రూ.45 లక్షల నుంచి రూ.70 లక్షలకు పెంచే అవకాశం.
ఇతర నగరాల్లో పరిమితిని రూ.50 లక్షల వరకు పెంచే అవకాశం.
హోం లోన్‌పై వడ్డీకి పన్ను మినహాయింపును రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచే అవకాశం.
ఈ మార్పుల వెనుక కారణాలు
పెట్రోల్-డీజిల్ ధరలను తగ్గించాలని CII (Confederation of Indian Industry) సిఫార్సు. మేక్ ఇన్ ఇండియా ప్రోత్సాహానికి ఎలక్ట్రానిక్స్ భాగాల దిగుమతి సుంకం తగ్గింపు. బంగారం దిగుమతి పెరగకుండా నియంత్రించేందుకు ఇంపోర్ట్ డ్యూటీ పెంపు. కొత్త ట్యాక్స్ విధానంతో ప్రజలకు తక్కువ పన్నుతో ఆదాయం పెరిగే అవకాశం. ఎన్నికల దృష్ట్యా రైతులు, వైద్యరంగానికి పెద్ద మొత్తంలో నిధుల కేటాయింపు.
ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఈ మార్పులు ఎలా ఉంటాయో చూడాలి!