ఎలోన్ మస్క్ సంచలన ప్రకటన, ట్విట్టర్ లో వాణిజ్య, ప్రభుత్వ వినియోగదారులకు స్వల్ప చార్జీలు?

Elon Musk Announces that Twitter Maybe a Slight Cost for Commercial and Government Users, Elon Musk Announces that Twitter Maybe a Slight Cost for Commercial Users, Elon Musk Announces that Twitter Maybe a Slight Cost for Government Users, Twitter Inc will always be free for casual users but may charge a slight fee for commercial and government users, Twitter Inc may charge a slight fee for commercial and government users, Elon Musk says Twitter may charge slight fee for Commercial and Government Users, Twitter might come with a slight cost for Commercial and Government Users, Twitter Inc might charge a slight fee for commercial and government users, commercial and government users, Twitter will always be free for casual users, Musk suggests Twitter might start imposing fee for Commercial and Government Users, Elon Musk, CEO of Tesla Motors, Tesla CEO, Tesla CEO Elon Musk, Tesla Motors, Twitter, Twitter News, Twitter Latest News, Twitter Latest Updates, Twitter fee, Mango News, Mango News Telugu,

సోషల్ మీడియా దిగ్గజ కంపెనీ ట్విట్టర్ ను ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈఓ, స్పేస్ ఎక్స్ అధినేత ఎలోన్ మస్క్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ట్విట్టర్‌ను 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయడానికి ఎలోన్ మస్క్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడని ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. మరో కొన్ని నెలల్లో ట్విట్టర్‌ పూర్తి స్థాయిలో ఎలోన్ మస్క్ ఆధ్వర్యంలో నడవనుంది. అయితే ట్విట్టర్‌ లో భారీ మార్పులు దిశగా ఎలోన్ మస్క్ అడుగులు వేయనున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఎలోన్ మస్క్ తాజాగా సంచలన ప్రకటన చేశారు. “సాధారణ వినియోగదారులకు ట్విట్టర్ ఎల్లప్పుడూ ఉచితం, కానీ వాణిజ్య/ప్రభుత్వ వినియోగదారులకు కొంచెం ఖర్చు కావచ్చు” అని ప్రకటించారు.

ట్విట్టర్ వినియోగం కోసం వాణిజ్య/ప్రభుత్వ వినియోగదారులు ఇకపై స్వల్ప మొత్తంలో ఫీజు చెల్లించాల్సి వస్తుందని ఎలోన్ మస్క్ చేసిన ట్వీట్ పై పెద్దఎత్తున చర్చ జరుగుతుంది. అయితే దీనిపై ట్విట్టర్ సంస్థ ఇంకా పూర్తిస్థాయి అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. మరోవైపు ట్విట్టర్ కొనుగోలుకు ముందునుంచే ప్లాట్‌ఫారమ్‌ లో చేయబోయే మార్పులపై ఎలోన్ మస్క్ వరుస ప్రకటనలు చేశాడు. కొత్త ఫీచర్‌లతో ప్లాట్‌ఫారమ్‌ను మెరుగుపరచాలని పేర్కొన్నాడు. నమ్మకాన్ని పెంచేందుకు, స్పామ్ బోట్స్ ను నివారించడానికి మరియు మానవులందరినీ ప్రామాణీకరించడానికి అల్గారిథమ్‌లను ఓపెన్ సోర్స్‌గా మార్చాలనుకుంటున్నట్లు ఎలోన్ మస్క్ ప్రకటించాడు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × five =