సీబీఎస్ఈ 10,12 వ తరగతి పరీక్షలు రద్దయ్యే అవకాశం?

CBSE Likely to Cancel Class 10 and 12 Board Exams?

కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో వాయిదా పడిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 10 వ తరగతి, 12 వ తరగతి పరీక్షలను జూలై 1 వ నుంచి 15 తేదీ వరకు నిర్వహిస్తామని ఇటీవలే బోర్డు షెడ్యూల్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ పరీక్షలు రద్దు అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. కరోనా వ్యాప్తి సమయంలో సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహించకుండా రద్దు చేయాలనీ ఇటీవలే కొందరు విద్యారుల తల్లిదండ్రులు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా, ఈ రద్దు అంశాన్ని పరిశీలించి జూన్ 23 లోపు నిర్ణయాన్ని తెలియజేయాలని సీబీఎస్ఈ బోర్డును కోర్టు ఆదేశించింది.

సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలు కేవలం నార్త్ ఈస్ట్ ఢిల్లీలోనే జరగాల్సి ఉండగా, 12వ తరగతి పరీక్షలు మాత్రం ఆల్ ఇండియాలో జరగాల్సి ఉంది. దీంతో ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలు రద్దు చేసి ఇంటర్నల్‌ మార్కుల ఆధారంగా పాస్‌ చేసి విద్యార్థులకు గ్రేడ్స్ ఇవ్వాలని అధికారులు భావిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ విషయంపై అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది. జూన్ 22 లోపు ‌సీబీఎస్ఈ 10,12 తరగతి పరీక్షలపై కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu