సీడబ్ల్యూసీ స్థానంలో 47 మంది నేతలతో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు, కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే కీలక నిర్ణయం

Congress President Mallikarjun Kharge Forms Steering Committee with 47 Members in Place of Congress Working Committee, Congress President Mallikarjun Kharge, Steering Committee, 47 Members in Place of Congress Working Committee, Congress Working Committee, Mango News,Mango News Telugu, Mallikarjun Kharge Congress President ,Former Congress President Sonia Gandhi, Shashi Tharoor , Sonia Gandhi, Sonia Gandhi News, Congress Presidential Election, Rahul Gandhi Bharat Jodo Yatra

కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మల్లికార్జున్ ఖర్గే అక్టోబర్ 26, బుధవారం బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాధ్యతలు చేపట్టిన మొదటిరోజునే మల్లికార్జున ఖర్గే కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు ఉన్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) స్థానంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. మొత్తం 47 మంది సీనియర్‌ నేతలతో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేశారు. ఇందులో మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌, సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ తదితర పార్టీల సీనియర్‌ నేతలు సభ్యులుగా ఉన్నారు. అలాగే తెలుగు రాష్ట్రాల నుంచి టి.సుబ్బిరామిరెడ్డికి మాత్రమే అవకాశం దక్కింది. ఇక ఈ కమిటీలో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేసిన ప్రత్యర్థి శశి థరూర్‌కు చోటు దక్కలేదు.

47 మంది నేతలతో కూడిన కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ ఇదే:

  1. సోనియా గాంధీ
  2. మన్మోహన్ సింగ్
  3. రాహుల్ గాంధీ
  4. ఎకె ఆంటోనీ
  5. అభిషేక్ మను సింఘ్వీ
  6. అజయ్ మాకెన్
  7. అంబికా సోని
  8. ఆనంద్ శర్మ
  9. అవినాష్ పాండే
  10. గైఖాంగమ్
  11. హరీష్ రావత్
  12. జైరాం రమేష్
  13. జితేంద్ర సింగ్
  14. కుమారి సెల్జా
  15. కేసీ వేణుగోపాల్
  16. లాల్తన్‌హావ్లా
  17. ముకుల్ వాస్నిక్
  18. ఒమన్ చాందీ
  19. ప్రియాంక గాంధీ వాద్రా
  20. పి.చిదంబరం
  21. రణదీప్ సూర్జేవాలా
  22. రఘువీర్ మీనా
  23. తారిఖ్ అన్వర్
  24. చేల కుమార్
  25. డాక్టర్ అజయ్ కుమార్
  26. అధిర్ రంజన్ చౌదరి
  27. భక్త చరణ్ దాస్
  28. దేవేంద్ర యాదవ్
  29. దిగ్విజయ్ సింగ్
  30. దినేష్ గుండూరావు
  31. హరీష్ చౌదరి
  32. హెచ్‌కే పాటిల్
  33. జై ప్రకాష్ అగర్వాల్
  34. కె.హెచ్ మునియప్ప
  35. బి.మాణికం ఠాగూర్
  36. మనీష్ చత్రత్
  37. మీరా కుమార్
  38. పిఎల్ పునియా
  39. పవన్ కుమార్ బన్సాల్
  40. ప్రమోద్ తివారీ
  41. రజనీ పాటిల్
  42. రఘు శర్మ
  43. రాజీవ్ శుక్లా
  44. సల్మాన్ ఖుర్షీద్
  45. శక్తి సింగ్ గోహిల్
  46. టి.సుబ్బిరామి రెడ్డి
  47. తారిఖ్ అహ్మద్ కర్రా.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − fourteen =