కరోనా వ్యాక్సిన్ పై శుభవార్త, కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ కు నిపుణుల కమిటీ ఆమోదం

Bharat Biotech Covaxin Vaccine, Bharat Biotech’s Covaxin Vaccine, CDSCO, CDSCO Experts Panel, CDSCO Experts Panel Approval for Bharat Biotech’s Covaxin Vaccine, coronavirus news, Coronavirus News Updates, coronavirus vaccine, Coronavirus Vaccine In India, Coronavirus Vaccine News, Coronavirus Vaccine Updates, Covaxin Vaccine, Mango News Telugu

కరోనా వైరస్ నివారణకు “కొవాగ్జిన్‌” పేరుతో హైదరాబాద్ కు చెందిన భారత్‌ బయోటెక్‌ సంస్థ పూర్తి స్వదేశీయంగా వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. కొవాగ్జిన్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతించాలని కోరుతూ ఇటీవలే డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) కు భారత్‌ బయోటెక్ దరఖాస్తు చేసుకుంది. ఈ నేపథ్యంలో సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సిడిఎస్ సిఓ) నిపుణుల కమిటీ శనివారం నాడు కొవాగ్జిన్ అత్యవసర వినియోగానికి ఆమోదం తెలిపింది. కొవాగ్జిన్ వ్యాక్సిన్ పై భారత్ బయోటెక్ సమర్పించిన నివేదికను నిపుణుల కమిటీ సుదీర్ఘంగా పరిశీలించింది. అనంతరం కొవాగ్జిన్ కు షరతులతో కూడిన అనుమతి ఇవ్వాలంటూ డీసీజీఐకు సిఫార్సు చేస్తూ నిపుణుల కమిటీ నిర్ణయం తీసుకుంది.

మరోవైపు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ‌-ఆస్ట్రాజెనికా సౌజన్యంతో “కోవిషిల్డ్” పేరుతో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి కూడా శుక్రవారం నాడు నిపుణుల కమిటీ ఆమోదం తెలిపింది. ఇక ఈ రెండు కరోనా వ్యాక్సిన్స్ కు సంబంధించి నిపుణల కమిటీ సిఫార్సులకు డీసీజీఐ కూడా ఆమోదముద్ర వేస్తే, దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ అతిత్వరలోనే ప్రారంభం కానుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ