వచ్చే 3 నెలలు మరింత ఆదాయం సాధించేలా కృషి చేయాలి: సీఎస్

CS Somesh Kumar, CS Stress To Generate More Revenue, Mango News Telugu, Revenue and Excise Department, Revenue and Excise Department Officials, Telangana CS, Telangana CS Met Revenue Department, Telangana News, Telangana Political News, Telangana Political Updates, Telangana Revenue and Excise Department, Telangana Revenue Department

రాష్ట్రంలో ఎక్సైజ్, కమర్షియల్ టాక్స్ శాఖల ద్వారా మరింత ఆదాయం సాధించేలా వచ్చే 3 నెలలు కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను కోరారు. శనివారం నాడు బిఆర్కెఆర్ భవన్ లో రాష్ట్ర ఎక్సైజ్, కమర్షియల్ టాక్స్ శాఖల అధికారులు సీఎస్ సోమేశ్ కుమార్ ని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్సైజ్, కమర్షియల్ టాక్స్ ల ద్వారా ఆదాయ సాధనకు టీం వర్క్ తో కృషి చేస్తున్నందుకు అభినందనలు తెలుపుతూ, రాబోయే రోజులలో అధికారులు మరింత కృషిచేసి రాష్ట్ర ఆర్ధిక పరిపుష్ఠికి పునరంకితులు కావాలని కోరారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం ఎక్సైజ్ శాఖలో వివిధ క్యాటగిరీలలో 131 పోస్టులు, నూతనంగా 14 ఎక్సైజ్ స్టేషన్లు, కమర్షియల్ టాక్స్ శాఖలో 161 పోస్టులు, 18 నూతన సర్కిళ్ళు మంజూరు చేసిందని వివరించారు. ఈ శాఖలలో చాలా పోస్టులు అప్ గ్రేడ్ చేయటం వలన సిబ్బందికి ప్రమోషన్ వచ్చే అవకాశాలు మెరుగవుతాయని అన్నారు. శాఖల రీఆర్గనైజేషన్ వలన ఉద్యోగుల కేరీర్ లో పురోగతి ఉండటంతో పాటు విధుల నిర్వహణలో సంతృప్తికి అవకాశం కలుగుతుందన్నారు. ఈ శాఖల రీఆర్గనైజేషన్ వలన ఈ శాఖలలో పనిచేసే సిబ్బందికి ప్రమోషన్లు లభిస్తాయని అన్నారు. ప్రమోషన్లకు సంబంధించి ప్రాసెస్ ఇప్పటికే మొదలైందన్నారు. ఈ నూతన సంవత్సరంలో చాలామంది ఉద్యోగులు ప్రమోషన్లు పొందుతారని సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × two =