ప్రపంచవ్యాప్తం ఎన్నో దేశాల్లో డేంజర్ బెల్స్ మోగిస్తున్న మంకీపాక్స్.. ఇండియాలోకి రాకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ తాజాగగా అధికారులతో సమీక్షీంచారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే ఎంపాక్స్ వైరస్‌పై ప్రపంచ దేశాలకు హెచ్చరికలు జారీ చేసింది. దీనికి తోడు కేసుల సంఖ్య, మృతుల సంఖ్య పెరగిందన్న వార్తలతో.. ప్రిన్సిపల్ సెక్రటరీ డా.పీకే మిశ్ర నేతృత్వంలోని అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన ప్రధాని మోదీ.. మంకీపాక్స్‌ని ఎలా ఎదుర్కోవాలనే విషయంపై చర్చించారు.
ఈ వైరస్‌పై అన్ని రాష్ట్రాల్లో టెస్టింగ్ ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలని మోదీ ఆదేశించారు. వైరస్‌ని త్వరగా గుర్తించేలా చర్యలు చేపట్టాలని చెప్పిరు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 15,600 మంకీపాక్స్ కేసులు నమోదవగా.. మంకీపాక్స్‌తో 537 మందికి పైగా మృతి చెందారు.దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. అయితే భారతదేశంలో ఒక్క మంకీ పాక్స్ కేసు కూడా నమోదు కాలేదని ప్రధాని తెలిపారు. ఆఫ్రికాలోని చాలా రాష్ట్రాల్లో మంకీపాక్స్ విస్తరిస్తుండటంతో డబ్ల్యూహెచ్ఓ ..ఎంపాక్స్‌ను పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ గా ప్రకటించిన విషయాన్ని మోదీ గుర్తు చేశారు.
కేసులను వెంటనే గుర్తించేందుకు సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ.. ప్రిన్సిపల్ సెక్రటరీ అధికారులను ఆదేశించారు. ముందస్తు వైరస్ నిర్ధారణ కోసం టెస్టింగ్ ల్యాబ్స్‌ని వెంటనే రెడీ చేయాలని సూచించారు. ప్రస్తుతం 32 ల్యాబ్‌లను టెస్టులను కోసం రెడీ చేశారని..ఈ వైరస్ ను అడ్డుకోవడానికి అందరూ కలిసికట్టుగా పని చేయాలని మోదీ తెలిపారు. అంతేకాకుండా మంకీపాక్స్ లక్షణాలపై ప్రజల్లో పూర్తి అవగాహన కల్పించాలని ప్రధాని చెప్పారు.
ఆఫ్రికా దేశాల్లో ఈ ఏడాది మొత్తంగా మంకీపాక్స్ సోకిన రోగుల సంఖ్య 18,737కి చేరింది. అయితే ఈ ఒక్క వారంలోనే 1200 ఎంపాక్స్ కేసులు నమోదైనట్లు డబ్ల్యూహెచ్‌ఓ ప్రకటించింది. ప్రాణాంతకమైన క్లాడ్-1తో పాటు అన్ని రకాల వైరస్‌లతో కలిపి డబ్ల్యూహెచ్‌ఓ ఈ గణాంకాలు విడుదల చేసినట్లు పేర్కొంది. మొత్తంగా ఇప్పటివరకూ 545 మరణాలు సంభవించాయి. కాంగోలో ఈ ఒక్క వారంలో 202 కేసులు నిర్ధారణ కాగా.. 24 మంది చనిపోయారు. 12 ఆఫ్రికా దేశాల్లో మంకీపాక్స్ వైరస్ కేసుల్ని గుర్తించగా..మరణాల రేటు 8.2శాతంగా ఉన్నట్లు అధికారులు చెప్పారు. కాంగో సరిహద్దు దేశం బురుండిలో ఈ వీక్‌లో 39కేసులు నిర్ధారణవగా.. ఆఫ్రికా వెలుపల ఉన్న పాకిస్థాన్‌లో కూడా మంకీపాక్స్ కేసులు వెలుగు చూడటం ఇప్పుడు కలవరం రేపుతోంది.
మంకీపాక్స్ చాపకింద నీరులా విజృంభించడంతో..డబ్ల్యూహెచ్‌ఓ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించి.. విపత్తుపై అత్యవసర కమిటీని కూడా ఏర్పాటు చేసింది. తొలిదశలో ఆ కమిటీ సిఫార్స్‌లను ప్రచురిస్తామని తెలిపింది. ఎన్‌జీవోలతో కలిసి టీకా ఉత్పత్తులను స్పీడప్ చేయాలని డబ్ల్యూహెచ్‌ఓ పిలుపునిచ్చింది. అటు దక్షిణాఫ్రికాలో సమావేశమైన దక్షిణాఫ్రికా డెవలప్‌మెంట్ దేశాల ప్రతినిధులు ..డబ్ల్యూహెచ్‌ఓతో పాటు వ్యాధి నియంత్రణా సంస్థలు, అంతర్జాతీయ భాగస్వాములు, మంకీపాక్స్ నివారణకు కృషి చేయాలని అభ్యర్ధించారు.