భారతీయ వంటకం ఎన్నో ప్లేసులో ఉంది?

The Worst Curry in the World, Worst Curry in the World, World Worst Curry, World Worst Rated Foods, Indian Cuisine is in Many Places, Worst Curry, Indian Cuisine Curry, Latest World Worst Curry News, World Worst Curry News, Latest News World Worst, Latest World Food News, Health News, Health News, Mango News, Mango News Telugu
World Worst Rated Foods, worst curry in the world, Indian cuisine is in many places, worst curry,Indian cuisine

కొంతమంది కూరగాయలు ఏమైనా సరే ఎంచకుండా తినేస్తారు. కానీ చాలామంది ఆ కూరగాయ తినను.. ఈ కూరగాయ తినను అంటూ కొన్ని వెజిటబుల్స్ పేరు చెబుతారు. ఒకవేళ ఇంట్లో ఆ కూర చేస్తే.. ఏ పచ్చడితోనో, పెరుగుతోనో భోజనం కానిచ్చేస్తారు తప్ప ఆ కర్రీ మాత్రం ముట్టుకోరు.

అయితే భారతీయుల్లో చాలామంది వంకాయ అంటే ఇష్టపడతారు. వంకాయతో వెరైటీలు చేయించుకుని మరీ తింటారు. కానీ వంకాయలో కూడా తెల్లవంకాయ, ఊదారంగు  వంకాయ టేస్ట్ తేడా ఉందంటారు కొంతమంది. తెల్లవంకాయను ఎంతగా ఇష్టపడతారో.. ఊదారంగు  వంకాయను అంత అసహ్యించుకుంటారు. అందుకేనేమో  ఈ ఊదారంగు బ్రింజల్‌తో చేసే భారతీయ వంటకమే అత్యంత వరస్ట్‌ కర్రీగా.. చెత్త ఆహారాల లిస్టులో స్థానం దక్కించుకుంది.

ఆన్‌లైన్‌ ఫుడ్‌ పోర్టల్‌లో ఫేమస్ అయిన ‌ టేస్ట్‌ అట్లాస్‌.. ప్రతి సంవత్సరం  ప్రపంచంలోనే టాప్‌ వంద చెత్త ఆహారాల లిస్టును రిలీజ్ చేస్తుంది. అలాగే ఈసారి  అలా విడుదల చేసిన జాబితాలో ..భారత దేశం నుంచి తక్కువ రేటింగ్స్‌ పొందిన ఆలు బైంగైన్ ఆ లిస్టులో స్థానం దక్కించుకుంది. ఇది సుమారు వంద వంటకాల్లో 60వ స్థానాన్ని దక్కించుకుంది.

ఆలు బైంగైన్ కూరను ఆలుగడ్డ, వంకాయ, ఉల్లిపాయ, టమోటాలు, అ‍ల్లం వెల్లులి పేస్టు వేసి గ్రేవీ వంటకం చేస్గారు. దీన్ని ఇష్టపడే వారు చాలా తక్కువ మంది ఉండటంతో.. దీనికి ఇంత తక్కువ రేటింగ్‌ వచ్చింది.నిజానికి ఆలు బైంగైన్ వంటకాన్ని ఉత్తర భారతదేశంలోనే ఎక్కువ మంది తింటారు. అందులో కూడా 60 వ స్థానం సంపాదించుకోవడంతో చాలామంది దీనిని ఇష్టపడరని తేలింది.

ప్రపంచంలో అత్యంత వరస్ట్‌ కర్రీలలో తక్కువ రేటింగ్‌తో మొదటి స్థానాన్ని దక్కించుకుంది.. హాక్లర్‌ అనే వంటకం. ఇది ఐస్లాండ్‌కి చెందిన వంటకం అయిన దీన్ని షార్క్‌ మాంసం 3 నెలల పాటు పులియబెట్టి చేస్తారు ఇది చాలా ఘాటైన రుచి  కలిగి ఉండటంతో పాటు  చాలామందికి నచ్చదట.  ఐస్లాండ్‌లో ఉండే స్థానిక ప్రజలు మాత్రమే హాక్లర్‌ను ఇష్టంగా తింటారట. పర్యాటకులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తినడానికి ఇష్టపడరట.

అలాగే తక్కువ రేటింగ్‌లో రెండో స్థానంలో అమెరికాకు చెందని రామన్‌ బర్గర్‌ నిలిచింది.  రామన్‌ బర్గర్.. న్యూడిల్స్‌తో చేసే బర్గర్‌. మధ్యలో మాంసాన్ని నింపి ఈ బర్గర్‌ను తయారుచేస్తారు. చాలా తక్కువ మందికి మాత్రమే ఈ బర్గర్‌ నచ్చుతుందట. అయితే ప్రతి దేశానికి చెందిన ప్రజలు.. తమకు ఏ ఆహారం నచ్చలేదో దానిని టేస్టీ అట్లాస్‌ పోర్టల్‌లో  పాల్గొని చెప్పొచ్చు. ఇలా  తమకు వచ్చిన లిస్టులో.. ఏ వంటకాలు బాగోవని తక్కువ రేటింగ్‌ ఇస్తారో.. వాటినే వంద చెత్త వంటకాలలో ఎంపిక చేస్తారు. అలా భారత దేశం నుంచి ఆలూ బైంగైన్‌ చోటు దక్కించుకుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 − 7 =