కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ ఐదు రాష్ట్రాలకు రూ.3,113.05 కోట్ల అదనపు కేంద్ర సహాయానికి ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకుంది. 2020 వ సంవత్సరంలో నివర్, బురేవి తుఫాన్లతో పాటుగా పంటల్లో తెగులు కారణంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, బీహార్, పుదుచ్చేరి, మధ్యప్రదేశ్ రాష్ట్రాల కోసం ఈ నిధులను కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి (ఎన్‌డిఆర్‌ఎఫ్) నుంచి ఈ ఐదు రాష్ట్రాలకు రూ.3,113.05 కోట్ల సహాయాన్ని అందిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇందులో నైరుతి రుతుపవనాల కారణంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.280.76 కోట్లు ఇచ్చేందుకు ఆమోదం తెలిపారు.
కేంద్రం నుంచి అదనపు సాయం పొందిన రాష్ట్రాలివే:
- నైరుతి రుతుపవనాల కారణంగా వచ్చిన వరదల వలన నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ కు రూ.రూ.280.76 కోట్లు.
- నైరుతి రుతుపవనాల కారణంగా వచ్చిన వరదల వలన నష్టపోయిన బీహార్ కు రూ.1,255.27 కోట్లు.
- నివర్, బురేవి తుఫాన్లతో నష్టపోయిన తమిళనాడుకు రూ.286.91 కోట్లు.
- నివర్ తుఫాన్ కారణంగా నష్టపోయిన కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరికి రూ.9.91 కోట్లు
- ఖరీఫ్-2020 సందర్భంగా తెగులు వలన నష్టపోయిన మధ్యప్రదేశ్‌కు రూ.1,280.18 కోట్లు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ